Bizarre Food Items In The World: ఆహారపు అలవాట్లు సాధారణంగా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఆయా ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, అక్కడ దొరికే పంటల ఆధారంగా అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు ఉంటాయి. అయితే, కొన్ని దేశాల ప్రజలు తినే వింత ఆహార పదార్థాలను చూస్తే వాక్ అనాల్సిందే. బాబోయ్.. మనుషులు ఇలాంటి ఫుడ్స్ కూడా తింటారా? అని ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ అత్యంత జుగుప్సాకరమైన ఆహారాలు ఏంటి? అవి ఏ దేశాల్లో ఫేమస్ అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ నాగుపాముల పకోడి: మనం దేవతగా ఇష్టపడే నాగుపామును ఇండోనేషియాలో పకోడీలు చేసుకుని తింటారు. అక్కడి ప్రజలు అత్యంత ఇష్టంతో తినే ఫుడ్ ఐటెమ్స్ లో నాగుపాము పకోడీ ఒకటి. ఇండియాలో వీక్లీ చికెన్, మటన్, ఫిష్ తిన్నట్లుగానే అక్కడి ప్రజలు నాగుపాము పకోడి తింటారు.
⦿ తొండల ఫ్రై: ప్రపంచంలో అత్యంత వింతైన ఆహార పదార్థాలను తినడంలో చైనీయులు ముందుంటారు. ఇక్కడి ప్రజలు తొండల ఫ్రైని ఎంతో ఇష్టంగా తింటారు. వానపాముల ఫ్రై, గబ్బిలాల కర్రీ, దోమల ఫ్రై, బొద్దింకల వేపుడు లొట్టేసుకుని తింటారు.
⦿ రోస్ట్ చేసిన ఎలుకలు: రోస్ట్ చేసిన ఎలుకలు వియత్నాంలో చాలా ఫేమస్. అక్కడి రెస్టారెంట్లతో పాటు వీధుల్లోనూ రోస్ట్ చేసిన ఎలుకలను వేలాడదీస్తారు.
⦿ ఎర్ర చీమల ఫ్రై: ఈ ఫుడ్ ను ఇండియాలోని ఒడిషా, చత్తీస్ గఢ్ లో ఇష్టంగానే తింటారు. దీనిని కాయ్ చట్నీ అని కూడా పిలుస్తారు. ఎర్ర చీమలు, వాటి గుడ్లను పచ్చడిగా తయారు చేసుకుని తింటారు. ఈ చట్నీ ఆరోగ్యానికి మంచిదని స్థానికులు నమ్ముతారు. కానీ, చీమలు తినడం చాలా మంది అస్సహించుకుంటారు.
⦿ కోపి లువాక్: ఈ కాఫీ ఇండోనేషియాలో చాలా ఫేమస్. ఈ కాఫీని సివెట్ పిల్లి తిని, విసర్జించిన కాఫీ గింజలతో తయారు చేస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీలలో ఒకటి. తయారీ విధానం చాలా మందికి జుగుప్సాకరంగా అనిపిస్తుంది.
⦿ మోపాన్ వార్మ్స్: దక్షిణాఫ్రికాలో ఈ ఫుడ్ చాలా ఫేమస్. పెద్ద కందిరీగల లార్వాలను వేయించి లేదంటే ఎండబెట్టి తింటారు. ఇవి క్రంచీగా ఉంటాయి. కానీ, చూడటానికి, తినడానికి చాలా మందికి వికారంగా అనిపిస్తాయి.
⦿ సిల్క్‌వార్మ్ పప్పీ: ఈ ఫుడ్ ఇండియాలోని నాగా లాండ్ లో చాలా ఫేమస్. సిల్క్‌వార్మ్ గుడ్లు, లార్వాలను వేయించి లేదంటే ఉడికించి తింటారు. వీటిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుందని నమ్ముతారు. స్థానిక మార్కెట్లలో వీటికి కిలో ధర రూ.500-700 ఉంటుంది.
⦿ శిశువు పిండం సూప్: ప్రపంచంలోనే అత్యంత జుగుప్సాకరమైన ఆహార పదార్థం ఇది. చైనాలో మంచి హెల్త్ కోసం, బెస్ట్ సెక్స్ లైఫ్ కోసం, గర్భంలో ఎదిగి, ఎదగని శిశువును తీసి, సూప్ చేసి తీసుకుంటారు. వినడానికి షాకింగ్ గా ఉన్నా నిజం. సోషల్ మీడియాలో దీనికి గురించి చాలా సమాచారం అందుబాటులో ఉంది.
Read Also: వామ్మో.. నది నిండా అనకొండలు.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!