BigTV English
Advertisement

TG BJP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం? కుండబద్దలు కొట్టిన రఘునందన్!

TG BJP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం? కుండబద్దలు కొట్టిన రఘునందన్!

TG BJP: బీఆర్ఎస్, కవిత వ్యవహారం శైలిపై ఆయన దుమ్మెత్తిపోశారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం ప్రజలకు బీజేపీ దగ్గరవుతోందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


జనం గుండె చప్పుడు బీజేపీ అని, అయినా మా పార్టీపై బురద జల్లాలని చూస్తున్నారని అన్నారు. పెయిడ్ ఆర్టికల్స్‌తో మాపై బురద జల్లుతున్నారని చెప్పుకొచ్చారు. వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని కవిత కూడా చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పెయిడ్ బ్యాచ్‌పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉండి ఐపీలు చిక్కకుండా పిచ్చి రాతలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ లేదని ఒక్కమాటలో తేల్చేశారాయన. కేసీఆర్, బీఆర్ఎస్, కవిత చెల్లని రూపాయిగా ఆయన వర్ణించారు. ఆ పార్టీని ప్రజలు మ్మే పరిస్థితిలో లేరన్నారు. 30 యూట్యూబ్ ఛానెళ్లకు జీతం బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకునే పనిలో కేటీఆర్ పడ్డారన్నారు. తప్పుడు కథనాలు రాసేవారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తామని వారికి తెలుసన్నారు.


గడిచిన పదేళ్లలో అమరవీరులకు ఏమీ జరగలేదన్నారు బీజేపీ ఎంపీ. వాళ్ల కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. మీ ఆస్తులను మాత్రమే పెంచుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు జనం వీఆర్ఎస్ ఇచ్చారని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

ALSO READ: కవిత విషయంలో బీఆర్ఎస్ వెనక్కి,తెర వెనుక ఏం జరిగింది?

2019 ఎంపీ ఎన్నికల్లో కవిత ఓడిపోయారని అన్నారు. అక్కడ కవితకు ఏమీ లేదన్నారు. నిత్యం మీడియాలో ఉండేందుకు బీఆర్ఎస్ నేతలు తహతహలాడుతున్నారని, ముఖ్యంగా కేటీఆర్, కవిత ఉండాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. అమరుల కుటుంబాన్ని పరామర్శించారా? అంటూ కవితను సూటిగా ప్రశ్నించారు.

తప్పించుకోవడానికే ఊరికే చిట్‌చాట్ అంటున్నారా? మీ పంచాయితీని మీరు మీరు తేల్చుకోవాలని కానీ అనవసరంగా బీజేపీని వివాదాల్లోకి లాగొద్దన్నారు.  2004లో కాంగ్రెస్‌తో ఆ పార్టీ పొత్తు పెట్టుకుని కేంద్రం, రాష్ట్రంలో రెండుచోట్లా మంత్రులుగా ఉన్నది వారేనని అన్నారు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు.

2014లో కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తామని ఏం చేశారని ప్రశ్నించారు. ఫ్యామిలీ మొత్తం సోనియాగాంధీతో ఫోటోలు దిగలేదా? ప్రస్తుతం బీజేపీ ఒంటరిగా ఎదుగుతోందన్నారు. మీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదన్నారు. 2019లో బీజేపీ నాలుగు ఎంపీలు గెలుచుకుందని, 2024 ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకుందన్నారు.

ఇలాంటి వ్యవహారాలు చిట్ చాట్‌లో కవిత చెప్పడం ఎందుకు? డైరెక్ట్‌గా మీడియా సమావేశం పెట్టి వెల్లడిస్తే సరిపోతుందన్నారు.  తప్పించుకునేందుకు ఇదొక మార్గమా? బీఆర్ఎస్ విలీనం గురించి బీజేపీ ఎన్నడూ చర్చలు జరపలేదన్నారు.  సీట్లు, ఆస్తుల పంచాయితీ ఉంటే మీరు మీరు తేల్చుకోవాలన్నారు.  మీ విషయాల్లోకి మా పార్టీని లాగవద్దని అన్నారు.

బీసీ వ్యక్తి అయిన ఈటెల పార్టీ నుంచి తొలగించలేదా? హరీష్‌రావు బీజేపీ కోవర్టు అన్నది కవిత అభిప్రాయం అయితే, ఆయన్ని పార్టీ నుంచి ఎందుకు తొలగించలేదని అన్నారు. మీ విలీనాలన్నీ అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో బీజేపీతో విలీనం ఉండదని తెగేసి చెప్పేశారు.

Related News

Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

Big Stories

×