జియో తన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం ఒక అద్బుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. జియో సిమ్ ఉన్న వారందరికీ ఇది ప్రత్యేక ఆఫర్. ఇందులో భాగంగా, జియోహోమ్, జియో మోర్ సర్వీసులు మొత్తం రెండు నెలల పాటు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. అంటే 2 నెలల ఫ్రీ ట్రయల్ ద్వారా టీవీ ఛానెల్స్, ఓటిటి యాప్‌లు, వైఫై సదుపాయం అన్నీ ఒకేసారి ఉపయోగించుకోవచ్చు.
1000కి పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్
జియో ఈ ఆఫర్‌లో భాగంగా 1000కి పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్ అందుబాటులో ఉంటాయి. అందులో న్యూస్, మూవీస్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని విభాగాలు ఉన్నాయి. అదేవిధంగా 11కి పైగా ప్రముఖ ఓటీటీ యాప్‌లు కూడా ఇందులో ఉచితంగా లభిస్తాయి. వాటిలో జీ5, సోనీ లివ్, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లు ఉండడం వల్ల వినియోగదారులు విభిన్న రకాల కంటెంట్‌ను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా చూడవచ్చు. అంతేకాదు, అన్ లిమిటెడ్ వైఫై సదుపాయం కూడా ఈ ట్రయల్‌లో భాగంగా ఇవ్వబడుతుంది.
Also Read: Motorola Edge 60 Pro: ఇంత పవర్‌ఫుల్ ఫోన్‌నా? మోటరోలా కొత్త బ్లాస్ట్
ఎప్పటి వరకు ఆఫర్ ఉంటుందంటే?
ఈ ఆఫర్ ప్రారంభం సెప్టెంబర్ 1, 2025 నుంచి జరిగింది. అంటే జియో వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్‌లకు గిఫ్ట్‌గా ఇచ్చినట్టే. ఇది పరిమిత కాల ఆఫర్. కాబట్టి ఈ ఉచిత ట్రయల్ నవంబర్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకసారి మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత, రెండు నెలల పాటు ఫుల్ యాక్సెస్ పొందవచ్చు.
యాక్టివేట్ చేసుకోవడం చాలా సింపుల్
ఆఫర్‌ను ప్రారంభం(Activate) చేయడం చాలా సింపుల్. మీ ఫోన్‌లో మైజియో యాప్ ఓపెన్ చేసి జియోహోమ్ లేదా జిఓమోరే ఫ్రీ ట్రయల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీ అకౌంట్‌లో ఈ సర్వీస్ లైవ్ అవుతుంది. మీరు టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి జియో సెట్‌టాప్ బాక్స్ లేదా స్మార్ట్ టీవీ ఉంటే, నేరుగా ఈ సర్వీసులు యాక్సెస్ చేయవచ్చు.
వినియోగదారులకు బంపర్ గిఫ్ట్
ఈ ఆఫర్ జియో వినియోగదారులకు నిజంగా బంపర్ గిఫ్ట్. రెండు నెలలపాటు టీవీ ఛానెల్స్, ఓటీటీలు, అన్‌లిమిటెడ్ వైఫై అన్నీ ఉచితంగా లభించడం అనేది ఎక్కువ ప్రయోజనం అనే చెప్పాలి. ముఖ్యంగా కుటుంబం మొత్తం వినోదాన్ని ఆస్వాదించడానికి ఇది సరైన అవకాశం. అందువల్ల మీరు కూడా ఈ ఆఫర్‌ను వెంటనే యాక్టివేట్ చేసుకుని, రెండు నెలల పాటు ఉచిత వినోదాన్ని ఎంజాయ్ చేయండి.