ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ ఎందుకు పెడతారు. సింపుల్ ఆన్సర్, ఫాలోవర్స్ పెరగడం కోసం. అవును, ఇన్ స్టా లో ఎంట్రీ ఇచ్చే ఎవరికైనా ఫస్ట్ అండ్ లాస్ట్ టార్గెట్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ ఫాలోవర్స్ పిచ్చి మరీ శృతి మించితే ఏమవుతుంది. అనుకున్నట్టుగా మన వీడియోలకు రీచ్ లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు..? ఇన్ స్టా పిచ్చి బాగా ముదిరిన మిషా అగర్వాల్ అనే యువతి మాత్రం ఏకంగా సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇన్ స్టా లో తన ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతోందని కొన్నిరోజులుగా బాధపడుతున్న ఆమె.. చివరకు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.
టార్గెట్ 10 లక్షలు..
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మిషా అగర్వాల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇన్ స్టా లో ఆమెకు మూడున్నర లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ సంఖ్య తక్కువేం కాదు, అయితే ఆమె టార్గెట్ మాత్రం 10లక్షలు. అంటే ఒక మిలియన్ ఫాలోవర్లను రీచ్ కావాలని ఆమె టార్గెట్ పెట్టుకుంది మిషా. అనుకున్నట్టుగా తన 25వ పుట్టినరోజు నాటికి ఆ టార్గెట్ రీచ్ కాలేకపోయింది. ఇంకేముంది తీవ్ర నిరాశలోకి వెళ్లింది. చివరకు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
LLB స్టూడెంట్..
మిషా అగర్వాల్ చదువులో చురుగ్గా ఉండేది. ఆమె LLB స్టూడెంట్. కెరీర్ పై ఫోకస్ పెట్టాల్సిన టైమ్ లో ఆమె ఇన్ స్టా లోకి అడుగు పెట్టింది. అంతే అక్కడితో ఆమెకి ఇన్ స్టా మాత్రమే లోకమైంది. ఫాలోవర్లే ఆమె కుటుంబ సభ్యులుగా మారారు. 10 లక్షలమంది ఫాలోవర్లను సాధించాలని టార్గెట్ పెట్టుకున్న మిషా.. ప్రతి రోజూ వీడియోలు పోస్ట్ చేసేది. అయితే ఆమె జస్ట్ కంటెంట్ పై మాత్రమే దృష్టి పెట్టడం విశేషం. ఫాలోవర్ల కోసం ఎలాంటి అతి వీడియోలను ఆమె పోస్ట్ చేసేది కాదు. ఎక్కడా అసభ్యంగా ప్రవర్తించడం కానీ, అసభ్యకరమైన మాటలు కానీ ఆమె వీడియోల్లో కనిపించవు. డ్రెస్సింగ్ కూడా చాలా హుందాగా ఉండేది. ఆమె కుటుంబ సభ్యులు కూడా మిషాని ప్రోత్సహించారు కానీ, అదే లోకంగా చేసుకోవద్దని ఎప్పటికప్పుడు హెచ్చరించేవారు.
ఏప్రిల్ 24న మిషా అగర్వాల్ చనిపోయింది. ఆమె ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయిందంటూ చాలామంది ఎంక్వయిరీలు మొదలు పెట్టారు. ఆమె ఫాలోవర్లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. చివరకు ఆమె ఇన్ స్టా అకౌంట్ నుంచే కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. దానికి కారణం కూడా ఆమె చెల్లెలు బయటపెట్టింది. 10లక్షలమంది ఫాలోవర్లను టార్గెట్ గా పెట్టుకున్న మిషా కేవలం మూడున్నర లక్షలమందికి మాత్రమే చేరువకాగలిగింది. ఇటీవల కాలంలో ఆ ఫాలోవర్లు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నారు. దీంతో మిషా తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. చెల్లెలితో కూడా ఎప్పుడూ ఇదే విషయంపై చర్చించేది. చివరిగా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
బీ కేర్ ఫుల్..
ఇన్ స్టా నే లోకంగా బతికే చాలామందికి మిషా అగర్వాల్ ఆత్మహత్య ఒక పాఠంగా ఉండాలి. ఇన్ స్టా లో ఫాలోవర్లు పెరగనంత మాత్రాన ప్రపంచం మునిగిపోదు. మన గుర్తింపు తగ్గిపోదు. మనకి సత్తా ఉన్న రంగంలో రాణించాలి. ముందు చదువుపై ఫోకస్ పెట్టాలి. చదువు పూర్తయ్యాక ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ చదువుతూనే ఆయా రంగాల్లో రాణించాలంటే కెరీర్ పై ఫోకస్ ఉండాలి. ఓటమిని కూడా ఒప్పుకునే విశాల దృక్పథం ఉండాలి. LLB లో రాణించాల్సిన మిషా ఇన్ స్టా నే లోకంగా భావించి చివరకు ఆత్మహత్య చేసుకుంది. చదువు పూర్తి చేసి ఉంటే.. మంచి లాయర్ గా స్థిరపడేది. కానీ ఇన్ స్టా ఫాలోవర్లతోనే తన సక్సెస్ అనుకున్న మిషా అర్థాంతరంగా తనువు చాలించి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.