Sritej Health Update: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రిలీజ్ టైంలో ప్రీవియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నాడు.. గత ఐదు నెలలుగా ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ కిమ్స్ లో చికిత్స పొందుతూనే ఉన్నాడు. అతని హెల్త్ అప్పటినుంచి ఇప్పటివరకు పెద్దగా మార్పు కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు. తాజాగా శ్రీతేజ్ ను కిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ పరిస్థితిపై తండ్రి భాస్కర్ ‘బిగ్ టీవీ’కి పలు వివరాలు తెలిపారు.
శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..?
డిసెంబర్ 4 నుంచి నిన్నటివరకు శ్రీతేజ్ ను నిమ్స్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచిన విషయం తెలిసిందే.. అప్పటినుంచి అతని పరిస్థితి అలానే ఉందని అర్థమవుతుంది. మొన్నీమధ్య శ్రీ తేజ హెల్త్ అప్డేట్ ని వైద్యులు రిలీజ్ చేశారు.. ప్రస్తుతం అతను కళ్ళు తెరుస్తున్నాడని, లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నాడని వైద్యులు బులిటన్లో పేర్కొన్నారు. గత 15 రోజుల నుండి శ్రీతేజ్ నోటి ద్వారానే లిక్విడ్స్ తీసుకుంటున్నదని అతని తండ్రి భాస్కర్ తెలిపారు. ఆరోగ్యం స్థిరంగానే ఉన్నప్పటికీ మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాడని, త్వరలోనే ఆ సమస్య నుండి కూడా కోలుకుంటాడని ఆశిస్తున్నాము అంటూ ఆయన మీడియా తో చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం ఫుడ్ తీసుకోవడానికి కడుపుకి ఒక సర్జరీ చేయడం వల్ల ఆహారం కొంత తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. రిహాబిలిటేషన్ సెంటర్ కి షిఫ్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అతని కుటుంబ సభ్యులు తాజాగా బిగ్ టీవీ తో మాట్లాడారు.. ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం..
Also Read : కావ్యతో బ్రేకప్ పై నిఖిల్ క్లారిటీ.. అమ్మ మాటే ఫైనల్..
బిగ్ టీవీ తో శ్రీతేజ్ పేరెంట్స్..
గత ఐదు నెలలుగా ఎటువంటి చలనం లేకుండా బెడ్కే పరిమితమైన శ్రీతేజ్ ను నిన్న కిమ్స్ డాక్టర్స్ డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతన్ని రిహాబిలిటేషన్ సెంటర్ కి మార్చారు. తాజాగా శ్రీతేజ్ తండ్రి బిగ్ టీవీ తో మాట్లాడారు. ‘‘శ్రీతేజ్ ప్రస్తుతం చూస్తున్నాడు. కానీ మనుషులను గుర్తుపట్టలేదు.. ఫుడ్ కోసం సర్జరీ చెయ్యడం వల్ల సెమీ లిక్విడ్స్, లిక్విడ్స్ తీసుకుంటున్నాడు. రిహాబిలిటేషన్ సెంటర్ కి మార్చడం వల్ల అతనిలో కదలికలు మొదలవుతాయని డాక్టర్లు చెప్పారు. ఏదైనా ఇక భారం అంతా దేవుడి మీద వదిలేసి ఉండడమే మంచిది అని వాళ్ళు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మళ్లీ హాస్పిటల్ కి తీసుకెళ్తే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక నెల అలా అబ్జర్వేషన్ లోంచి ఆ తర్వాత తీసుకురావాలని డాక్టర్ తెలిపారు. ఏది ఏమైనా కూడా శ్రీతేజ్ ప్రాణాలతో బయటపడ్డాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా బయటకు వస్తాడని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.