BigTV English

Inter Student Plan Divorce To Parents: మెడికల్ సీటు కోసం తల్లిదండ్రుల విడాకులు?.. ఎందుకో తెలుసా?

Inter Student Plan Divorce To Parents: మెడికల్ సీటు కోసం తల్లిదండ్రుల విడాకులు?.. ఎందుకో తెలుసా?

Inter Student Plan Divorce To Parents For Medical Seat: ఇండియాలో ప్రస్తుతం పిల్లలను పదవ తరగతి తర్వాత పై చదువులు చదివించలంటే ఎంత కష్టమో తెలిసిందే. అందులో మెడిసిన్ సీటు సాధించడం అనేది అతి పెద్ద కష్టం.


సీట్లేమో తక్కువ పోటీల పడే సంఖ్యేమో ఎక్కువ. నీట్‌లో మంచి ర్యాంక్ రాకపోతే ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాదు. పోనీ ప్రైవేట్ కాలేజీల్లో మెడిసిన్ చదవాలంటే లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి. కానీ మెరిట్‌తో పాటు రిజర్వేషన్ కూడా ఉంటే చదివించడానికి కాస్త బెటర్.

ఎలాంటి రిజర్వేషన్ లేకుండా మెడికల్ సీటు కొట్టాలంటే రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాల్సిందే. నీట్‌లో మంచి ర్యాంక్ రాకపోతే ఇండియాలో ప్రైవేట్ కాలేజీల్లో మెడిసిన్ చదివే స్థోమత లేక చాలా మంది విద్యర్తులు మెడిసన్ చదివేందుకు చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్తున్నారు.


Read More: జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు..!

అయితే తమ బిడ్డ మెడిసిన్ సీటు కోసం తల్లిదండ్రులు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అదెక్కడి వింతా అని ఆశ్చర్యపోతున్నారా? ఓ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లో వచ్చిన ప్రశ్నకు దానికి వచ్చిన సమాధానాన్ని ఓ నెటిజన్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇది చదివాక మీరు షాకవడం మాత్రం ఖాయం.

ఆ బిడ్డ అడిన ప్రశ్న.. “మా నాన్న ఓ ఎంఎన్‌సీ (MNC) కంపెనీలో పని చేస్తూ.. సంవత్సారనికి రూ.70 లక్షల జీతం సంపాదిస్తున్నారు. మా అమ్మ ఇల్లును చక్కబెడుతుంది. నేను పదవ తరగతి పాసయ్యాను. మెడిసిన్ చుదవుదామని అనుకుంటున్నాను. ఒకవేళ మా అమ్మానాన్న విడాకులు తీసుకొని నేను మా అమ్మతో కలిసి ఉంటే పేదలకు ఇచ్చే ఈబీసీ(EBC) కోటాలో మెడిసిన్ సీటు పొందడానికి నాకు అర్హత ఉంటుందా? నాకు మెడిసిన్ సీటు రాగానే నా పేరెంట్స్ మళ్లీ పెళ్లి చేసుకుంటారు” అని ప్రశ్న అడిగారు.

ప్రశ్నకు వచ్చిని సమాధానం.. “నువ్వు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నావు కదా. మీ అమ్మానాన్నకు విడాకులకు ప్లాన్ చేయడానికి నీకు ఇంకో సంవత్సరం టైం ఉంది. నీట్‌ కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసే సమయంలో మీ అమ్మ సింగిల్ మదర్ (Single Mother) అని నిరూపించడం కోసం విడాకులు తీసుకున్న డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలి. దీనికి అనుగుణంగా మీ అమ్మానాన్న విడాకులను ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు పేదలకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్ కోటా నీకు వర్తిస్తుంది. కానీ మీ అమ్మ భరణం రూపంలో పొందే వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉండాలి. అయితే నువ్వు ఎండీ లేద ఎంఎస్‌లో పది శాతం రిజర్వేషన్ పొందాలని అనుకుంటే.. మీ అమ్మానాన్నను అప్పటి వరకు మళ్లీ పెళ్లి చేసుకోవద్దని చెప్పు. వ్యక్తిగతంగా నాదొక సలహా నువ్వు మెడిసిన్ చదివే బదులు రాజకీయాల్లో చేరు” అని బదులిచ్చారు.

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చివరి లైన్ కరెక్ట్ అని కొందరు అభిప్రాయపడితే మరికొందరు మాత్రం పిల్లల మెడిసిన్ సీటు కోసం తల్లిదండ్రులు తమ దాంపత్య జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు. సంవత్సరానికి రూ.70 లక్షలు సంపాదించే తండ్రి మేనేజ్‌మెంట్ కోటాలో మెడిసిన్‌లో చేర్పించలేడా? అని మరి కొందరు కామెంట్లు పేడుతున్నారు.

ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తమ భర్తలను ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఇలా చేయడం లేదు కదా అని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు.

Tags

Related News

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Big Stories

×