Koi Koi Viral Video: సోషల్ మీడియాలో సినిమా పాటలను మించిన క్రేజ్ తెచ్చుకున్న పాట అది. ఇన్ స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇలా ఒకటి కాదు అన్ని సోషల్ మీడియా పేజీలలో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా కూడ చెప్పవచ్చు. ఇప్పటికే మీ మనసులో ఆ పాట మెదిలే ఉంటుంది. అదేనండీ ఓ పాస్టర్.. ఇటీవల ఫేమస్ అయ్యారుగా.. ఓ పాటతో.. ఆ పాటే కోయ్.. కోయ్ పాట. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కోయ్.. కోయ్ పాట తెలియని వారుండరు. ఇదొక భక్తిపాటగా పాస్టర్ ఆలపించినప్పటికీ, సోషల్ మీడియాలో పాట వైరల్ గా మారింది. కానీ పలువురు ఈ పాటను ట్రోలింగ్ చేసినప్పటికీ, పాటలోని భావాన్ని పాస్టర్ వివరించిన మరో వీడియో కూడ వైరల్ గా మారింది.
2024 ఏడాది డిసెంబర్ నెలలో కోయ్.. కోయ్ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాట ఆలపించిన పాస్టర్, సరైన హావభావాలు పలికిస్తూ మరింతగా ప్రజలను ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ప్రార్థనకు హాజరైన భక్తులకు సమయాభావం కనిపించకుండా, తాను చెప్పే మాటలు శ్రద్దగా వినేలా భక్తులను ఉత్సాహపరచడం పాస్టర్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. చెప్పే మాటలు భక్తుల మదిని తాకాలన్న తలంపుతో, పాస్టర్ తన నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడ చెప్పారు. ఆ వీడియోలు కూడ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ పాస్టర్ ఎవరు? ఆయన వెనుక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకొనేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈయన పేరు మీసాల గురవప్పగా ఇప్పటికే పలుమార్లు వీడియోలలో చెప్పుకున్నారు. ఈయన పూర్తి వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా కుంట గ్రామానికి చెందిన వారు గురవప్ప. ఈయన కోయజాతికి చెందిన దొర. గురవప్ప పుట్టిన సమయంలో ఆయన తల్లి మృత్యు ఒడిలోకి చేరారట. అయితే గురవప్ప పుట్టక మునుపే, తల్లి మతం మారినట్లు ప్రచారంలో ఉంది. ఆ సమయంలో కొందరు, ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టినట్లు కూడ అక్కడి స్థానికులు చెబుతుంటారు. అంతేకాదట ఈయన కుటుంబంలో మరో విషాద ఘటన జరిగినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. గురవప్ప సోదరుడు అడవికి బలైపోయినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: Pawan Kalyan: వన్ నేషన్.. వన్ వుడ్.. పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్
ఇలా గురవప్ప జీవితంలో ఎన్నో బాధాకర ఘటనలు ఉన్నాయట. ఆ తర్వాత భక్తిపరమైన మార్గంలో నడుస్తున్న గురవప్ప పాస్టర్ గా మారారు. అప్పటి నుండి తనదైన శైలిలో ప్రసంగిస్తూ, గురవప్ప తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఆయన చరిత్రకు సంబంధించి ప్రచారంలో ఉన్నది వాస్తవమో కాదో కానీ, మొత్తం మీద పాస్టర్ అభిమానులు మాత్రం ఆయన జీవితం తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండ ఇటీవల పాస్టర్ లక్ష్యంగా ట్రోలింగ్ చేసిన వారు కూడ, ఇప్పుడు కాస్త వెనుకంజ వేశారు. మొత్తం మీద ఎవరి మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్న విషయాన్ని సమాజం గుర్తుంచుకోవాలని పాస్టర్ అభిమానులు కోరుతున్నారు. చివరగా పాస్టర్ గారూ.. మీ నిజజీవితం తెలిసింది.. మీకు ఫిదా అంటున్నారు అభిమానులు. మరి తన జీవిత చరిత్ర గురించి సాగుతున్న ప్రచారంపై పాస్టర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి!