BigTV English

Viral Video: బిడ్డను తీసుకురావడంతో తండ్రి ఆలస్యం.. గేటు వద్దే గొడవకు దిగిన భార్య..

Viral Video: బిడ్డను తీసుకురావడంతో తండ్రి ఆలస్యం.. గేటు వద్దే గొడవకు దిగిన భార్య..

Viral Video: నోయిడాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ఎన్ఆర్ఐ తండ్రి తన చిన్న అమ్మాయిని మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8:00 గంటల వరకు తనతో ఉంచుకోవాలని కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. ఆ తర్వాత అతను తన భార్య దగ్గర అమ్మాయిని విడిచిపెట్టవలసి ఉంటుంది. అయితే ఈ తరుణంలో ఎన్‌ఆర్‌ఐ తండ్రికి ఒక రోజు బిడ్డను విడిచిపెట్టడానికి భార్య వద్దకు చేరుకోగా, కొంత ఆలస్యం జరిగింది. ఆ తర్వాత భార్య సొసైటీ గేటు వద్ద అతనితో గొడవకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ అనే ఖాతా నుండి ఈ వీడియో అప్‌లోడ్ చేశారు. వివాహం చేసుకున్న భార్యభర్తలు ఇద్దరు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. అయితే తమకు ఓ కూతురు ఉండడం వల్ల ఫ్యామిలీ కోర్టు ఆదేశాల మేరకు తన కుమార్తెను కొంత సమయం తల్లి వద్ద, మరికొంత సమయం తండ్రి వద్ద ఉంచుకునేందుకు ఆదేశించింది. ఈ తరుణంలో తండ్రి వద్ద కూతురు ఉండే సమయం అయిపోవడంతో తనను డ్రాప్ చేసేందుకు గ్రేటర్ నోయిడాలోని ఐఐటీఎస్ నింబస్ ఎక్స్‌ప్రెస్ పార్క్ వ్యూ సొసైటీ గేటు వద్దకు చేరుకున్న ఎన్నారై తండ్రి తన భార్యతో, గేటు వద్ద ఉన్న గార్డుతో గొడవ పడ్డాడు. కూతురుని డ్రాప్ చేయడం కాస్త ఆలస్యం అయిందని భార్య, భార్తతో గొడవకు దిగింది. దీంతో పోలీసులు వచ్చి ఎన్నారై అయిన భర్తను అరెస్టు చేశారు.

అయితే మంగళవారం సాయంత్రం బాలిక నిద్రపోయింది. ఆందోళన చెందిన తండ్రి అప్పటికే బిడ్డ నిద్రిస్తున్నందున ఆలస్యంగా వస్తుందని తల్లికి తెలిపాడు. కానీ, భార్య పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కిడ్నాప్ కేసు పెడతామని తండ్రిని బెదిరించారు. భయపడిన తండ్రి నిద్రిస్తున్న బాలికను తన ఒడిలో ఎత్తుకుని బిడ్డను తిరిగి ఇచ్చేందుకు వెళ్లాడు. ఈ తరుణంలో భార్య పెట్టిన కేసు కారణంగా భర్తను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Related News

ATOR N1200: వరద ప్రాంతాల్లో అటోర్ వాహనాల మోహరింపు, ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటంటే?

Elephant video: వావ్.. ఏనుగులు గుంపు ఎలా స్నానం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్

Maid Fined: పని మనిషికి రూ.8 లక్షల జరిమానా.. ఏంటీ, సెలవు రోజు పని చేసినా తప్పే?

Scorpion: తేలు విషం లీటరు రూ.80 కోట్లా? ఇంతకీ దానితో ఏం చేస్తారు?

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Big Stories

×