BigTV English

JSW Shares Investment: 1990లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన తండ్రి.. కొడుకుకు వారసత్వంగా కోట్ల ఆస్తి

JSW Shares Investment: 1990లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన తండ్రి.. కొడుకుకు వారసత్వంగా కోట్ల ఆస్తి

JSW Shares Investment| కుటుంబం కోసం పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. భవిష్యత్తులో పిల్లల ఆర్థిక భద్రత కోసం తల్లిదండ్రులు తమ సంపాదనలో కొంత ఆదా చేస్తుంటారు. కొందరైతే మరింత ముందుచూపుతో మంచి పెట్టుబడి మార్గాన్ని అన్వేషించి.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ప్లాన్ చేస్తారు. అయితే ఇవన్నీ అంచనాలతో కూడుకున్నవి. కానీ ఒక వ్యక్తి చేసిన పెట్టుబడులు అంచనాలు మించి ఊహించని లాభాలు తెచ్చిపెట్టాయి.


1990లలో ఒక తండ్రి తన కుటుంబం కోసం చిన్న ఆలోచనతో మొదలైన పెట్టుబడి, ఇప్పుడు అతని కొడుకుకి కోట్ల రూపాయల సంపదగా మారింది. ఒక సామాన్య వ్యక్తి తన కుటుంబ భవిష్యత్తు కోసం చేసిన ఓ చిన్న నిర్ణయం ఎలా అద్భుత ఫలితాలను ఇచ్చిందో చెబుతుంది. ఈ కథ జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్ (ఇప్పుడు JSW స్టీల్) షేర్ల గురించి. ఒక లక్ష రూపాయలతో మొదలై, ముప్పై సంవత్సరాలలో 80 కోట్ల రూపాయలుగా పెరిగిన ఒక చిన్న పెట్టుబడికి సంబంధించిన సక్సెస్ స్టోరీ.

ముప్పై సంవత్సరాల క్రితం, ఒక తండ్రి తన కష్టార్జిత డబ్బుతో, కేవలం ఒక లక్ష రూపాయలతో జెఎస్‌డబ్లూ (JSW) స్టీల్ షేర్లను కొన్నాడు. ఆ రోజుల్లో ఈ మొత్తం చాలా పెద్దది. అతను ఈ షేర్లను కొని, వాటిని సురక్షితంగా దాచి, భవిష్యత్తు కోసం వదిలిపెట్టాడు. అతను చాలా సాధారణంగానే ఆ సమయంలో పెట్టుబడి పెట్టాడు. తన కుటుంబానికి ఆర్థిక భద్రత కోసమే ఆ పెట్టుబడిని అన్వేషించాడు. అతను ఈ షేర్ల గురించి ఎక్కువగా మాట్లాడలేదు, కానీ అవి తన కొడుకు జీవితంలో ఒక రోజు పెద్ద మార్పును తీసుకురాగలవని విశ్వసించాడు.


కాలక్రమంలో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. అతని కొడుకు, ఒక సామాన్య యువకుడు, ఇటీవల తన తండ్రి దాచిన పాత షేర్ సర్టిఫికెట్లు అతని చేతికి చిక్కాయి. ఆ షేర్లు 1990లో కొన్న JSW స్టీల్ షేర్లు. అతను వాటి విలువను తెలుసుకోవడానికి పరిశోధించాడు. ఆశ్చర్యకరంగా, ఆ ఒక లక్ష రూపాయల పెట్టుబడి ఇప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయలుగా మారింది! ఈ విషయం అతని జీవితంలో ఒక అద్భుత క్షణంగా మారింది.

సోషల్ మీడియాలో ఈ కథను ఇన్వెస్టర్ సౌరవ్ దత్తా షేర్ చేశాడు. అతను ట్విట్టర్ ఎక్స్ లో చేసిన పోస్ట్ లో ఇలా రాశాడు.. “ఒక వ్యక్తి తన తండ్రి 1990లో ఒక లక్ష రూపాయలతో కొన్న JSW కంపేనీ షేర్లను కనుగొన్నాడు. ఇప్పుడు అవి 80 కోట్ల విలువైనవి. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి యొక్క శక్తి!” ఈ పోస్ట్ చాలా మందిని ఆకర్షించింది. ప్రజలు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక యూజర్ తన కామెంట్ చేస్తూ.. “ఇప్పుడు అతను రిటైర్ అయి సంతోషంగా జీవించవచ్చు. ఈ డబ్బుతో మంచి వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు.” అని రాస్తే.. మరొకరు “స్టాక్ స్ప్లిట్‌లు, బోనస్‌లు, డివిడెండ్‌లు కాలక్రమేణా ఎలా పెరుగుతాయో ప్రజలు అర్థం చేసుకోరు. ఇది నిజంగా అద్భుతం.”

Also Read: ఆఫీసులో ఒత్తిడితో బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి

ఈ కథలో తండ్రి తన కొడుకు కోసం వదిలిపెట్టిన వారసత్వం కేవలం డబ్బు మాత్రమే కాదు, ఓపిక, విశ్వాసం భావాల విలువ కూడా అని అందరూ గ్రహించాలి. JSW స్టీల్, భారతదేశంలో ప్రముఖ స్టీల్ తయారీ సంస్థ, దాని ఒక షేర్ ధర ఇప్పుడు సుమారు 1004.90 రూపాయలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.37 ట్రిలియన్ రూపాయలు. ఈ కథ దీర్ఘకాలిక పెట్టుబడులు ఎలా జీవితాన్ని మార్చగలవో చూపిస్తుంది.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×