OTT Movie : 2019 లో దుల్కర్ సల్మాన్ నటించిన ఒక మూవీ దాదాపు ఆరేళ్ళ తరువాత తెలుగులో ఓటీటీలోకి వచ్చింది. ఇందులో దుల్కర్ సల్మాన్ కి జోడీగా సంయుక్త మీనన్ నటించింది. కేరళలోని కడమక్కుడి గ్రామంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. లల్లూ (దుల్కర్ సల్మాన్) అనే చిత్రకారుడు తన జీవితంలో ‘స్పార్క్’ కలిగించే అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. ఇతను తన స్నేహితులతో కలిసి జీవితాన్ని సరదాగా గడుపుతుంటాడు. అయితే ఒక అమ్మాయి ప్రేమతో ఇతని స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ మలయాళ ప్రేమ కథ మూవీ పేరు? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ కథ కేరళలోని కడమక్కుడి అనే చిన్న గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ లల్లూ (దుల్కర్ సల్మాన్) ఒక సాధారణ చిత్రకారుడు. రోజువారీ కూలీ చేసుకుంటూ, తన స్నేహితులైన పంచికుట్టన్, విక్కీ పీడిక, మరియు టెనీ సెబాస్టియన్‌లతో కలిసి జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. లల్లూ, ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ, తన తండ్రి కొంబనాయిల్ జాన్, ఒక ప్రముఖ క్రిమినల్ లాయర్ జీవనశైలిని విడిచిపెట్టి, సామాన్య జీవితాన్ని ఎంచుకుంటాడు. అతని లక్ష్యం తన హృదయంలో ‘స్పార్క్’ సృష్టించే అమ్మాయిని కనిపెట్టి, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడం. ఇక లల్లూ తన స్వప్న సుందరి కోసం ఎదురుచూస్తుంటాడు.
లల్లూ అతని స్నేహితులు గ్రామంలో చిన్న చిన్న సాహసాలు, సరదా క్షణాలతో జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఈ సమయంలో అతని జీవితంలోకి కొత్త పాత్రలు ప్రవేశించడంతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. అతని ప్రేమ ప్రయాణంలో కుటుంబ నేపథ్యాల నుండి అడ్డంకులుగా వస్తాయి. చివరికి లల్లూకి తాను కోరుకున్న అమ్మాయి దొరుకుతుందా ? అతనికి కుటుంబంతో వచ్చే సమస్యలు ఏంటి ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : డైరీ మిల్క్ చాక్లెట్ ఫాయిల్ ఆధారంగా దొరికిపోయే కిల్లర్… ట్విస్టులతో పిచ్చెక్కించే మలయాళ క్రైమ్ థ్రిల్లర్
ఈ మలయాళం మూవీ పేరు ‘ఒరు యమందన్ ప్రేమకథ’ (Oru Yamandan Premakadha). తెలుగులో ‘ఒక యముడి ప్రేమకథ’ (Oka Yamudi Premakatha) గా స్ట్రీమింగ్ అవుతోంది. 2019 ఏప్రిల్ 25 న ఈ సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం అహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి IMDbలో 5.1/10 రేటింగ్ ఉంది. ఇందులో దుల్కర్ సల్మాన్, సౌబిన్ షాహిర్, సలీం కుమార్, విష్ణు ఉన్నికృష్ణన్, నిఖిలా విమల్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మలయాళం సినిమాకి బి.సి. నౌఫల్ దర్శకత్వం వహించారు.