BigTV English
Advertisement

Kerala Women: బాబోయ్ భార్య.. 10 మందితో పెళ్లి, ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం, చివరికి…

Kerala Women: బాబోయ్ భార్య.. 10 మందితో పెళ్లి, ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం, చివరికి…

Kerala Women Serial Weddings:  ఈ రోజుల్లో ఆడవారిని చూస్తే భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని మొగుళ్లను లేపేస్తున్న భార్యామణులు కొంత మంది ఉంటే,  ఏకకాలంలో ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం చేస్తున్న కిలేడీలు మరికొంత మంది ఉన్నారు.  తాజాగా కేరళకు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ ఏకంగా 10 మందిని పెళ్లి చేసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం చేస్తోంది. తాజాగా మరో పెళ్లి చేసుకుంది. పెళ్లి కొడుకు బంధువులకు అనుమానం రావడంతో అసలు కథ బయటపడింది.  ఒకే మహిళ 10 మందితో సంసారం చేయడం ఏంట్రా బాబోయ్ అని అందరూ షాక్ అవుతున్నారు.


అసలు విషయం ఏంటంటే?

కొచ్చికి చెందిన రేష్మ తాజాగా తిరువనంతపురం సమీపంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె ప్రవర్తనపై పెళ్లి కొడుకు బంధువులకు అనుమానం కలగడంతో, ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.  వాళ్లు ఆమెను పోలీసులకు అప్పగించారు. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఆమె పెళ్లిళ్ల వ్యవహారం 2014 నుంచి కొనసాగుతున్నట్లు తేలింది. ఫస్ట్ పెళ్లి 2014లో ఎర్నాకులంకు చెందిన వ్యక్తితో జరిగింది. 2017 తర్వాత అతడిని నుంచి విడిపోయింది. ఆ తర్వాత 2022 వరకు మరో నాలుగు సార్లు పెళ్లి చేసుకుంది.  తిరువనంతపురం, అంగమాలి, తొడుపుళ, వాలకంకు చెందిన వ్యక్తులను మనువాడింది. ఆ తర్వాత కొల్లంకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడితో కొంతకాలం కలిసి ఉంది. ఫలితంగా ఓ బిడ్డపుట్టింది. ఆ బిడ్డను తనే పెంచుకుంటుంది. అలా వరుసగా 10 మందిని పెళ్లి చేసుకుంది. తాజాగా రేష్మ రువనంతపురం శివారు ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. జూన్ 6న పెళ్లికి ముహూర్తం పెట్టుకుంది. అనుకున్నట్లుగానే రేష్మ జూన్ 5న తిరువనంతపురం చేరుకుని పంచాయతీ సభ్యుడికి తెలిసిన స్నేహితురాలి ఇంట్లో బస చేసింది. అనుకున్నట్లుగానే 6న అతడిని పెళ్లి చేసుకుంది.


రేష్మ తీరుపై పెళ్లి కొడుకు బంధువులకు అనుమానం

పంచాయితీ సభ్యుడితో పెళ్లి జరిగిన తర్వాత రేష్మ వ్యవహార శైలి బంధువులకు అనుమానం కలిగించింది. వెంటనే రేష్మ బ్యాగ్‌ను చెక్ చేశారు. గతంలో ఆమె పెళ్లి చేసుకున్న మ్యారేజ్ సర్టిఫికేట్ దొరికింది. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పెళ్లి అయ్యిందనే విషయాన్ని దాచిపెట్టి మళ్లీ పెళ్లి చేసుకుందని ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో గత పెళ్లిళ్ల బాగోతం బయటపడింది. ఈ పెళ్లి తర్వాత మరో ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలియడంతో అందరూ షాకయ్యారు.

భర్తలతో చాలా స్నేహపూర్వకంగా ఉండేది!

రేష్మ మోసం చేసి పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆమె తన పది మంది భర్తలతోనూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుందని పోలీసులు తెలిపారు. అనుమానం రాకుండా వారి ఇళ్లకు వెళ్లడానికి.. బీహార్‌ లో తాను స్కూల్ టీచర్ గా పని చేస్తున్నట్లు చెప్పింది. అదే సమయంలో ప్రతి ఒక్కరితో క్రమం తప్పకుండా మాట్లాడేందుకు ఫోన్ షెడ్యూల్‌ను కూడా ఫాలో అవుతున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే, రేష్మ భర్తలందరినీ పోలీసులు సంప్రదించారు. అయినా,  ఎవరూ ఆమె మీద దొంగతనం, మోసం కంప్లైంట్స్ చేయలేదు. మ్యాట్రిమోనియల్ సైట్స్ యువకులతో పరిచయం పెంచుకునే రేష్మ.. తన సొంత బిడ్డను దత్తత తీసుకున్నట్లు చెప్పేది. కానీ, తనకు పెళ్లి చేసుకోవాలనుందని సెంటిమెంట్ కథ చెప్పేది. దానికి పడిపోయి యువకులు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లైన కొద్ది రోజులకు పలు కారణాలు చెప్పి వారి నుంచి దూరంగా వెళ్లిపోయేది.  ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్న ఆర్యనాడ్ పోలీసులు.. అట్టుకులంగరలోని మహిళా జైలుకు పంపించారు.

Read Also: ఇవన్నీ చూశాక కూడా పెళ్లి చేసుకోవాలని ఉందా? ఈ టిప్స్ తో మీ ప్రాణాలు సేఫ్!

Related News

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Big Stories

×