BigTV English

Viral News : నలుగురితో లవ్ మ్యారేజ్.. ఫస్ట్ నైట్ రోజే..! కిలాడీ లేడీ

Viral News : నలుగురితో లవ్ మ్యారేజ్.. ఫస్ట్ నైట్ రోజే..! కిలాడీ లేడీ

Viral News : కిలాడీ లేడీలు పెరిగిపోతున్నారు. అందాన్ని ఎరగా వేస్తున్నారు. మాటలతో మాయ చేస్తున్నారు. ప్రేమ పేరుతో ఊబిలోకి దింపుతున్నారు. నిండా కూరుకుపోయారని కన్ఫామ్ చేసుకున్నాక.. ఇక అసలు కథ మొదలుపెడుతున్నారు. మా అమ్మకు బాలేదని.. మా చెల్లికి కాలేజ్ ఫీజ్ కట్టాలని.. మా నాన్నకు యాక్సిడెంట్ అయిందంటూ.. నోటికొచ్చిన sad Stories వినిపిస్తారు. అయ్యో పాపం అని లవర్‌ నమ్మేలా చేస్తారు. ఆ తర్వాత లక్షలకు లక్షలు వసూల్ చేస్తారు. వన్ ఫైన్ మార్నింగ్ జెండా ఎత్తేస్తారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసేస్తారు. ఇక ఖేల్ ఖతం. దుకాణం బంద్. ఆమె ఎవరో.. ఎక్కడ ఉంటుందో.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా అప్పటివరకూ ఆ యువతి ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన ఆ ప్రేమికుడికి చేదు అనుభవమే మిగులుతుంది. మోసపోయానని తెలిసాక.. అప్పుడిక లబోదిబోమని మొత్తుకున్నా ఎలాంటి యూజ్ ఉండదు. పోలీసులకు కంప్లైంట్ చేసినా.. ఇచ్చిన డబ్బులు తిరుగొస్తాయనే నమ్మకం తక్కువే. లేటెస్ట్‌గా అలాంటి మరో కిలాడీ లేడీ ఘటన కర్నాటకలో కలకలం రేపింది.


పక్కాగా ట్రాప్.. పైసా వసూల్

వైష్ణవి, శశికాంత్. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయ్యారు. కామెంట్లు కలిశాయి. ఎమోజీలు నచ్చాయి. గంటల తరబడి చాటింగ్. రోజుల తరబడి ఫీలింగ్స్. తొందరలోనే వారి ఫ్రెండ్‌షిప్ లవ్ టర్న్ తీసుకుంది. బయట కలుసుకున్నారు. రెస్టారెంట్స్‌, ఐస్‌క్రీమ్ పార్లర్స్ చుట్టూ తిరిగారు. మాల్స్, సినిమా హాల్స్‌కు రెగ్యులర్ కస్టమర్స్‌గా మారారు. అలా అలా 8 నెలలు గాఢంగా ప్రేమించుకున్నారు. నువ్వు లేక నేనుండలేను అనేంతగా. ఈ గ్యాప్‌లో అతని నుంచి కొంచెం కొంచెం చొప్పున చాలానే డబ్బులు తీసుకుంది. బంగారం గిఫ్టులు గట్రా తీసుకుంది.


ఫస్ట్ నైట్ రోజే.. లాస్ట్ నైట్

ఇక ప్రేమ చాలు పెళ్లి చేసుకుందాం అంటూ వైష్ణవి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చింది. ఆమెనే పెళ్లి మాట ఎత్తేసరికి.. శశికాంత్ ఫుల్ ఖుషీ అయ్యాడు. తాను అనాథనని తనకెవరూ లేరని చెప్పింది. సరేలే.. నేనున్నాలే అని ధైర్యం చెప్పాడు. ఆ ఇద్దరూ మార్చి 24న పెళ్లి చేసుకున్నారు. పెళ్లికూతురుకు భారీగా బంగారం చేయించారు అత్తింటివాళ్లు. ఘనంగా పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి వేడుకతో అంతా అలసి పోయి గాఢ నిద్రపోయారు. కట్ చేస్తే.. ఆ తెల్లారి మార్చి 25న పెళ్లికూతురు ఇంట్లో లేదు. ఇళ్లంతా వెతికినా కనిపించలేదు. చుట్టుపక్కల చూస్తే నో యూజ్. డౌట్ వచ్చి చెక్ చేస్తే.. బీరువాలో బంగారం, నగదు మాయం. అప్పుటికి కానీ తెలీలేదు ప్రేమ, పెళ్లి పేరుతో చేసిన మోసం. ఆమె లవర్ కాదు పెద్ద చీటర్.. అందాల దొంగ అని.

Also Read : అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలో అన్వేష్ ఎంట్రీ

నలుగురు మొగుళ్ల ముద్దుల పెళ్లాం..

వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశారు శశికాంత్ ఫ్యామిలీ. వాళ్లు చెప్పిన డీటైల్స్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆ యువతి పేరు అసలు వైష్ణవియే కాదని.. ఆమె అప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుందని తేలింది. ఆ ముగ్గురినీ ఇలానే ప్రేమించి పెళ్లి చేసుకుని.. డబ్బులతో ఉడాయించిందని గుర్తించారు. ఆమెకు నాలుగో మొగుడు.. నాలుగో బాధితుడు ఆ శశికాంత్.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×