Teachers Fight : దారుణంగా తిట్టుకున్నారు. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. జుట్టు జుట్టు పట్టుకొన్నారు. కింద పడేసి తన్నుకున్నారు. మధ్యలో ఒకతను ఎంటరై.. కాలితో ఆ మహిళను ఘోరంగా తన్నాడు. ఆ వీడియో ఇప్పుడు ఇండియా వైడ్ వైరల్ అవుతోంది. ఎందుకంటే.. కొట్టుకున్న వాళ్లిద్దరూ ఇద్దరూ మహిళలే. ఒకరు టీచర్. ఇంకొకరు అంగన్‌వాడీ వర్కర్. ప్రైమరీ స్కూల్‌లోనే.. విద్యార్థుల ముందే.. ఇలా పరస్పరం దాడులు చేసుకోవడంతో మేటర్ సీరియస్ అయింది. తీవ్రంగా గాయపడిన అంగన్‌వాడీ వర్కర్ పరిస్థితి సీరియస్‌గా ఉంది. హాస్పిటల్ ఐసీయూలో ట్రీట్మెంట్ నడుస్తోంది. ఇంతకీ ఈ గొడవ ఎలా జరిగింది? వాళ్లిద్దరూ ఎందుకంతలా కొట్టుకున్నారు?
అసలేం జరిగిందంటే..
ప్రీతి తివారీ. ప్రైమరీ స్కూల్ టీచర్. ఇటీవలే ట్రాన్స్‌ఫర్ మీద మరో స్కూల్‌కి వచ్చింది. అక్కడ పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్ చంద్రావతితో ఏదో విషయంలో మాటా మాటా పెరిగింది. కోపం కంట్రోల్ తప్పి.. చంద్రావతిపై దాడికి తెగబడింది ఆ బడి పంతులమ్మ. అంగన్‌వాడీ వర్కర్ సైతం రెచ్చిపోయింది. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. మాటలతో ఆగలేదు. చేతులకు పని చెప్పారు. జుట్లు జుట్లు పట్టుకుని పీక్కున్నారు. అదుపు తప్పి ఇద్దరూ కింద పడిపోయారు. అయినా.. జుట్లు మాత్రం వదల్లేదు. అటూ ఇటూ లాక్కున్నారు. నెట్టుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. వాళ్లిద్దరూ అలా కిందపడి కొట్టకుంటుంటే.. మధ్యలో ఒకతను పైనుంచి అంగన్‌వాడీ వర్కర్‌ను దారుణంగా తంతున్నాడు. కాలితో ఆమె తలపై బలంగా దాడి చేశాడు. అలా కొన్ని నిమిషాల సేపు ఆ కొట్లాట జరుగుతూనే ఉంది.
టీచర్‌కు సపోర్ట్‌గా స్టూడెంట్స్ అటాక్
ఇదంతా జరిగింది ప్రభుత్వ పాఠశాలలో. పక్కనే స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ చిన్నిపిల్లలే. విద్యార్థులు ఉన్నారనే కామన్‌సెన్స్ కూడా లేకుండా ఆ లేడీ టీచర్, మహిళా అంగన్‌వాడీ వర్కర్ కొట్టుకోవడం దారుణం. వీళ్ల గొడవలో మధ్యలో స్కూల్ పిల్లలు కూడా ఎంటర్ అయ్యారు. టీచర్‌కు సపోర్ట్‌గా కొందరు చిన్నపిల్లలు అంగన్‌వాడీ వర్కర్‌ను కొట్టడం వీడియోలో కనిపించింది. ఆ వీడియో తీసింది కూడా ఆ స్టూడెంట్సే.
ఆ టీచర్ మహా ముదురు..
కాసేపటి తర్వాత మిగతా స్కూల్ స్టాఫ్ వచ్చారు. ఆ ఇద్దరి కొట్లాటను ఆపే ప్రయత్నం చేశారు. ఇదంతా యూపీ, మధురాలోని ఓ ప్రైమరీ స్కూల్‌లో జరిగింది. వీడియో మాత్రం దేశమంతా వైరల్ అయింది. విషయం విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ప్రాథమిక విచారణలో స్కూల్ టీచరే మొదట దాడి చేసిందని తేలింది. ఆమెపై గతంలోనూ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయట. టీచర్ రఫ్ బిహేవియర్‌పై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. టీచర్ చేతిలో తీవ్రంగా గాయపడి అంగన్‌వాడీ వర్కర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీడియో ఇంతగా చక్కర్లు కొడుతుంటే.. స్థానిక పోలీసులు మాత్రం తమకు ఎలాంటి కంప్లైంట్ రాలేదంటూ ఖాకీ స్టైల్ స్టేట్‌మెంట్ ఇవ్వడం కొసమెరుపు.
*मथुरा*: 😎
आंगनवाड़ी सहायिका और शिक्षिका के बीच मारपीट, बच्चों के सामने हुआ हंगामा !
मथुरा के छाता क्षेत्र में एक आंगनवाड़ी केंद्र पर एक घटना सामने आई,, जिसकी वीडियो सोशल मीडिया पर वायरल हो रही है ।🧐 pic.twitter.com/u3zgJXLzB2
— जन स्वदेश पिटारा (@pradipy81315327) March 27, 2025