Marital Suicide: రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకొని మెహెందీ ఆర్టిస్ట్ పింకీ మృతిచెందింది. పోలీసుల వివరాల ప్రకారం ఏడాది క్రితం అమిష్‌లోయా అనే వ్యక్తిని పంకీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వీరు అత్తాపూర్‌లోనే నివాసం ఉంటున్నారు. మెహెందీ ఆర్టిస్ట్‌గా పింకీ జీవనం సాగిస్తోంది. అయితే ఈ రోజు తన గదిలో చున్నీతో ఉరి వేసుకొని పింకీ చనిపోయిందని స్థానికులు తెలిపారు.
పోలీసులు సమాచారం ఇవ్వడంతో పింకీ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. కూతురు మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. భర్త వేధింపుల వల్లే పింకీ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. పెళ్లి అయినప్పటి నుంచి పింకీ కుంటుంబ కలహాలతోనే ఇబ్బందులు పడుతోందని వాపోయారు. తమ కూతురును వేధించినందుకు అమిష్‌లోయాను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు.
ALSO READ: హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి
పింకీ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పింకీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించామని వెల్లడించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. పింకీ భర్తను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతామని అన్నారు.