BigTV English

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Weather Update: వర్షాకాలంలో వర్షాలు బాగా ఉన్నాయని దేశ వ్యాప్తంగా అలర్ట్‌గా ఉండాలని చెప్తారు. కానీ, వర్షాలను ఎలా కొలుస్తారు..? ఎవరు కొలుస్తారు..? అసలు వాతావరణ కేంద్రం జారీ చేసే సంకేతాలైన ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లకు అర్థం ఏంటి..? ఇలాంటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో మెదులుతుంటాయి.


వర్షం లేదా వాన ఆకాశంలోని మేఘాల నుంచి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఆకాశం నుంచి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్గా అని అంటారు. ఈ మొత్తం ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది.. ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్ ప్రక్రియ అంటారు.

అవపాతం అంటే..? జలచక్రములో వర్షం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుంచి నీరు ఆవిరిగా మారి.. ఆ తేమ తిరిగి ఆకాశములో ధ్రవీభవించి బుడగలలాగా ఏర్పడిన అవపాతం ఆకాశంలో తేలుతుంది. ఆ అవపాతం వర్షముగా మారి నేలకు చేరుతుంది. వర్షం పడిన అవపాతాన్ని తిరిగి సముద్రానికి నదులు చేర్చుతాయి.


అవపాత చక్రంలో వర్షాన్నిఇలా వర్గీకరిస్తారు..
. అతి తేలికపాటి వర్షం : అవపాతం గంటకు 1 మిల్లీ మీటర్లు కంటే తక్కువ ఉంటే
. తేలికపాటి వర్షం : అవపాతం గంటకు 1 మిల్లీ మీటర్లు కంటే నుండి 1 మిల్లీ మధ్య
. మీటర్లు మధ్యఒక మోస్తరు వర్షం : అవపాతం గంటకు 2 మిల్లీ మీటర్లు కంటే నుండి 5 మిల్లీ మీటర్లు మధ్య
. భారీ వర్షం: అవపాతం గంటకు 5 మిల్లీ మీటర్లు కంటే నుండి 10 మిల్లీ మీటర్లు మధ్య
. అతి భారీ వర్షం : అవపాతం గంటకు 10 మిల్లీ మీటర్లు కంటే నుండి 20 మిల్లీ మీటర్లు మధ్య
. కుండపోత వర్షం : అవపాతం గంటకు 20 మిల్లీ మీటర్లు కంటే ఎక్కువ ఉంటే అయితే వర్షపాతము కురిసే విధానాన్ని బట్టి వర్షాన్ని మరో రకంగా లెక్కిస్తారు..

వాతావరణ హెచ్చరికల అర్థం:

రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడంతో మీ నగరంలో లేదా మీ ప్రాంతంలో ఎల్లో, ఆరెంజ్, రెడ్ రంగులతో కూడిన హెచ్చరికలను జారీ చేస్తుంది వాతావరణ కేంద్రం. వాటి అర్థం ఏంటి..? అవి ఎలా నిర్ణయించబడ్డాయి..?

భారతదేశంలో భారత వాతావరణ శాఖ (IMD) ఈ హెచ్చరికలను జారీ చేస్తుంది. విభిన్న సందేశాలను వర్ణించడానికి 4 విభిన్న రంగు కోడ్‌లను ఉపయోగిస్తుంది. వివిధ వాతావరణ పరిస్థితులను సూచించడానికి, హెచ్చరికలను అందించడానికి సాధారణంగా ఉపయోగించే రంగు కోడ్‌లలో ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు ఉన్నాయి.

1. గ్రీన్ అలర్ట్:
గ్రీన్ అలర్ట్ అంటే సాధారణంగా వాతావరణ పరిస్థితులు బాగానే ఉన్నాయని అర్థం. ఈ అలర్ట్ సమయంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి సలహాను జారీ చేయలేదు.

2. రెడ్ అలర్ట్:
రెడ్ అలర్ట్ అంటే ప్రమాదకర పరిస్థితి అని అర్థం, 130 కి.మీ వేగంతో గాలులు వీచడం.. బలమైన వర్షం వంటి తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.. తుఫాను పరిధిలో ఉన్న ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది.. అవసరమైన చర్యలు తీసుకోవాలని. వాతావరణం ప్రమాదకర స్థాయికి చేరుకుని భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని.. అప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటిస్తామని వాతావరణ శాఖ చెబుతోంది.

కనీసం 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్న 30 మి.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడే ఈ తరహా హెచ్చరికలను ప్రకటిస్తారు. చాలా సందర్భాలలో భారీ వర్షాల కారణంగా వరదల ప్రమాదం చాలా రెట్లు పెరగడంతో లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు ఖాళీ చేయిస్తారు.

3. ఎల్లో అలర్ట్..
ప్రజలను హెచ్చరించడానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ని ఉపయోగిస్తుంది. ప్రమాదం గురించి తెలుసుకోవడం.. ఈ హెచ్చరిక కేవలం వాచ్ సిగ్నల్ అని.. ఏదైనా ప్రమాదం నుంచి ప్రజలను హెచ్చరించడానికి ఇది ఉపయోగించ బడుతుందని తెలిపారు. ఈ హెచ్చరిక సమయంలో వాతావరణ పరిస్థితి 7.5 నుండి 15 మి.మీ వరకు భారీ వర్షం కురుస్తుంది. ఇది వచ్చే 1 లేదా 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. వరదలకు కారణం కావచ్చు.. ఎల్లో అలర్ట్ సమయంలో వాతావరణాన్ని నిరంతరం నిశితంగా పరిశీలిస్తారు అధికారులు.

4. ఆరెంజ్ అలర్ట్:
వాతావరణం మరింత దిగజారడంతో ఎల్లో అలర్ట్‌ను ఆరెంజ్ అలర్ట్‌గా అప్‌డేట్ చేసినట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ తుఫాను వల్ల వాతావరణ పరిస్థితులు క్షీణించవచ్చు.. దీని వల్ల రోడ్డు, వాయు రవాణాకు నష్టం వాటిల్లవచ్చు అలాగే ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరగవచ్చు. అని తెలుపింది.

Also Read: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

అందుకే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తారు. అటువంటి పరిస్థితులలో గాలి వేగం గంటకు 65 నుంచి 75 కి.మీ, 15 నుంచి 33 మి.మీ, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేస్తారు. ఈ హెచ్చరికలో ప్రభావిత ప్రాంతంలో ప్రమాదకరమైన వరదలు వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన హెచ్చరికల నోటిఫికేషన్‌లో ప్రభావిత ప్రాంతం నుంచి ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని స్థానిక అధికారులను సిద్ధం చేస్తుంటారు.

వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? ఎవరు కొలుస్తారు..
అయితే మన ప్రాంతంలో ఎంత మొత్తంలో వర్షం కురిసిందనే లెక్క కూడా ఉంటుంది. ఎన్ని మి.మీ వర్షం కురిసిందో కూడా గుర్తిస్తారు. ఈ విషయాన్ని మన మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు అధికారులు లెక్కకడుతారు. ఎమ్మార్వో ఆఫీసులో పరిసరాల్లో ఉండే ఓ పరికరం ద్వారా ఆ వర్షపాతాన్ని గుర్తిస్తారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×