Intinti Ramayanam Today Episode june 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. కంపెనీకి సంబంధించిన పూర్తి అధికారం అక్షయ్ కు రావడంతో పల్లవి సంతోషానికి అవధులు ఉండవు. అవిని పీడ వదిలి పోయిందని పల్లవి చాలా సంతోషంగా ఆ విషయాన్ని తన తండ్రితో పంచుకోవాలని వెళుతుంది.. చక్రధర్ దగ్గరికి వెళ్లిన పల్లవి అవని నుంచి మొత్తం అధికారాన్ని అక్షయ్ బావ పేరు మీదకి వచ్చేలాగా చేసాము.. ఇప్పుడు ఆస్తిని మొత్తం అక్షయ్ చేతులారా పోగొట్టేలా చేయాలని అవని ప్లాన్ చేస్తుంది. అక్షయ్ తొందరపాటు వల్లే ఆస్తులన్నీ కోల్పోయామని వాళ్ళకి తెలియాలి మొత్తం అందరూ రోడ్డున పడాలి అని చక్రధర్ పల్లవి ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని తన తండ్రితో చెప్పిన తర్వాత పల్లవి మళ్లీ తన ఇంటికి వెళ్తుంది. అక్కడే ఉన్న కమల్ ను చూసి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే… పల్లవి ఇంటికి వెళ్ళగానే కమల్ హాల్లో కూర్చొని ఉండటంతో పల్లవికి వీడికి దొరికితే నన్ను చావు కొడతాడని పల్లవి సైలెంట్ గా సైడ్ అయిపోవాలని అనుకుంటుంది. వెనకలి నుంచి వెళ్లి గదిలోకి వెళ్లాలని పల్లవి అనుకుంటుంది. కానీ కమల్ మాత్రం పల్లవిని కనిపెట్టేస్తాడు.. ఎక్కడికి వెళ్లావు నువ్వు అని అడుగుతాడు. మా ఇంటికి వెళ్లానని పల్లవి సమాధానం చెబుతుంది. మీ నాన్న దగ్గరికి వెళ్లి పొద్దున ఏదో సంతకాల గురించి నువ్వు మీ నాన్న కుమ్మక్కయి చేశారు కదా.. ఇప్పుడు కూడా అలాంటి కొంపల గురించి పనులు ఏమైనా చేస్తున్నావా అని డైరెక్ట్ గా అడుగుతాడు..
కంపెనీని కాపాడాలని మా నాన్న అవని చేసిన మోసాన్ని బయట పెడితే నన్ను మా నాన్నని అంటావేంటి బావ అని పల్లవి అడుగుతుంది. కానీ కమల్ మాత్రం ఈరోజు మా అన్నయ్య దగ్గర మా వదిన దొరక పట్టించావు. రేపు నువ్వు మీ నాన్న తప్పు చేశారంటే తండ్రి కూతుళ్ళకి ఉంటుంది ఇద్దరికీ బడిత పూజ అని కమల్ పల్లవిని భయపెడతాడు. పల్లవి మాత్రం వీడికి భయపడేది ఏంటి అని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఏదో డీల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడే ఆఫీస్ కి వెళ్ళిన అవనిని చూసి మళ్లీ నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు.. కానీ నా ఫైల్స్ నా సర్టిఫికెట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి అందుకే నేను వచ్చానని అవని అంటుంది.
అవని లోపల ఉండగానే ఏదో ప్రాజెక్టు గురించి మాట్లాడాలని ఓ ఇద్దరూ లోపలికి వస్తారు. వాళ్ల ప్రవర్తన అంతా తేడాగా ఉండడంతో అవని వాళ్లతో మాట్లాడొచ్చిన అవసరమేంటి? పెద్ద ప్రాజెక్ట్ అన్నారు కదా ఒకసారి మామయ్య సలహా తీసుకోవడం మంచిది కదా అని అంటుంది అవని.. కానీ కమల్ మాత్రం నాకు సలహాలు ఇచ్చే రేంజ్కి నువ్వు ఎదిగావా..? బిజినెస్ గురించి నాకు తెలియదని నువ్వు చెప్తున్నావా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అక్షయ్ అవని మాటను లెక్క చేయడు. ఎంత చెప్పినా కూడా అవని మాట వినడు.
ఇప్పుడు సైన్ చేశారు కదా ఈ ఫైల్ లో ఏముందో మొత్తం చదివి వాళ్ళని ఇక్కడే ఉన్నారు కదా అడగండి అని అవని అంటుంది. లేదా ఒకసారి మావయ్య గారిని అడిగి పూర్తి సలహా తీసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్టుకు ప్రొసీడ్ అవ్వండి అని ఎంత చెప్పినా కూడా అక్షయ్ వినడు. పైగా అవని సెక్యూరిటీతో బయటికి గెంటెస్తాడు. ఇది ఇంటికి వెళ్లిన అవని బాధపడుతూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ వచ్చి ఈ బిజినెస్ గురించి నాకు భయంగా ఉంది మావయ్య అని అడుగుతుంది. కానీ వాడు మూర్ఖుడమ్మా ఎవరి మాట వినడు ఏం చేయాలో అది చేస్తాడులే అని అవనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు రాజేంద్రప్రసాద్..
ఇక పల్లవి అక్షయ చేతి నుంచి ఆస్తులు మొత్తం వెళ్లిపోతాయని సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని తట్టుకోలేక డాన్స్ వేయాలని అనుకుంటుంది. ఇదేదో కొంపలు ముంచే పని చేసినట్టు ఉంది అని శ్రీయా అనుకుంటుంది. నా విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు అని పల్లవి వార్నింగ్ ఇస్తుంది. ఉదయం లేవగానే కమల్ ఒక పేపర్ తీసుకొని వచ్చి అందరిని అరిచి పిలుస్తాడు. ఇందులో ఏం రాసిందో చూడండి అని అక్షయ్ కి ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…