Villain For Hire Service: తెలివి ఉంటే చాలు ఎడారిలో ఇసుక అమ్మి బతకొచ్చు! హిమాలయాల్లో మంచును మనీగా మార్చుకోవచ్చు! తాజాగా ఇలాంటి ఆలోచనే చేశాడు మలేషియాకు చెందిన వ్యక్తి. మీ గర్ల ఫ్రెండ్ ముందు, మీ భార్య ముందు మిమ్మల్ని హీరోగా చేస్తానంటున్నాడు.. 28 ఏండ్ల షజాలి సులైమాన్ అనే యువకుడు. తాజాగా ‘కిరాయి విలన్’(villain for hire) అనే సర్వీసును ప్రారంభించాడు. వినడానికి కొత్తగా ఉన్నా ప్రస్తుతం మలేషియాలో బాగా క్రేజ్ సంపాదించుకుంది.
ఇంతకీ షజాలి ఏం చేస్తారంటే?
అసలు విషయం ఏంటంటే.. ఎవరైతే తన సర్వీస్ కావాలనుకుంటారో వారు ముంతు తన ఆఫీస్ లో కాంటాక్ట్ కావాలి. చెప్పిన టైమ్ కు షజాలి తన క్లయింట్ చెప్పిన ప్లేస్ కు వెళ్తాడు. తన గర్ల ఫ్రెండ్ ను లేదంటే భార్యను వెకిలి వేషాలతో ఇబ్బంది పెడతాడు. వెంటనే సదరు మహిళ భర్త, లేదంటే బాయ్ ఫ్రెండ్ రెచ్చిపోయి షజాలి మీద దాడి చేస్తాడు. తన భార్య ముందు ఆకతాయి ఆటకట్టించాని జబ్బలు చరుచుకుంటాడు. హీరో అనిపించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. ఇందులో ఎవరికి గాయాలు కావు. దెబ్బలు తగలవు. తన భార్య లేదంటే గర్ల ఫ్రెండ్ ముందు షజాలి క్లయింట్ హీరోగా నిలబడుతాడు.
షజాలి ఈ సర్వీస్ కోసం ఎంత ఛార్జ్ చేస్తాడంటే?
షజాలి ఈ సర్వీస్ కోసం ఛార్జ్ ఫిక్స్ చేశాడు. ఒక్కో క్లయింట్ కు సుమారు గంట సమయాన్ని కేటాయిస్తాడు. అక్కడ పని అయిపోగానే మరో చోటుకు వెళ్తాడు. వీకెండ్ లో ఒక్కో క్లయింట్ కు RM150(భారత కరెన్సీలో సుమారు రూ.2,500) వసూళు చేస్తాడు. సాధారణ రోజుల్లో అయితే RM100(భారత కరెన్సీలో సుమారు రూ.1,800) వసూళు చేస్తాడు. ఇక తాను విలన్ లా కనిపించేందు పొడవైన జుట్టు, చేతిలో సిగరెట్ తో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సర్వీస్ మగవాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా అందుబాటులో ఉంటుందన్నాడు. అయితే, ప్రతి క్లయింట్ దగ్గరికి ఒకే గెటప్ లో కాకుండా, రకరకాల వేషాల్లో వెళ్తుంటాడు.
ఇదంతా WWE లాంటి వ్యవహారం
షజాలి రీసెంట్ గా ఓ క్లయింట్ కోసం చేసిన విలనిజం గురించి వివరించాడు. “నా క్లయింట్ బాత్ రూమ్ లో ఉండగా, నేను అతడి గర్ల్ ఫ్రెండ్ ను టీజ్ చేసినట్లు యాక్ట్ చేశాను. అతడు బాత్ రూమ్ నుంచి రాగానే నా మీద ఫైర్ అయ్యాడు. చేయి చేసుకున్నాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోలా మారిపోయాడు. నా సర్వీస్ అంతా WWE ఫైటింగ్ లాగే ఉంటుంది. ఇందులో నేనే ఓడిపోతాను. కానీ, ఎవరికీ గాయాలు కావు” అని చెప్పుకొచ్చాడు.
మలేషియాలో ఇది సాధ్యమయ్యేనా?
షజాలి ప్రకటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తున్నది. “బ్రో మంచి యాపారం మొదలుపెట్టాడు” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. “మాకు కూడా మీ అవసరం పడొచ్చు” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోలు అయ్యేందుకు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే, నిజంగా సమస్య వచ్చినప్పుడు పారిపోవాల్సి ఉంటుంది” మరికొంత మంది విమర్శిస్తున్నారు. అటు మలేషియాలో అమ్మాయిలన టీజ్ చేయడం కఠిన నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా అతడిపై కంప్లైంట్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందంటున్నారు మరికొంత మంది.
Read Also: డ్యూటీ టైమ్‌లో అలా చేసింది.. పాపం, ఆ పోలీస్ డాగ్‌కు బోనస్ కట్!