Team India: మంగళవారం రాత్రి భారత్ – ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడవ టి-20 లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. 172 పరుగుల లక్ష్య చేదనలో భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది. ఇక భారత బ్యాటర్లలో హార్థిక్ ఒక్కడే 40 పరుగులతో రాణించాడు. అభిషేక్ శర్మ 24 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు అంతా 15 పరుగులకు మించి రన్స్ చేయలేకపోయారు.
Also Read: Rohit Sharma: ఆటోలో ప్రయాణించిన రోహిత్ శర్మ…!
ఇక మ్యాచ్ అనంతరం ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఓటమికి ఇంగ్లాండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్ స్పెల్ కారణమని అన్నారు. అతడు అద్భుతంగా బోలింగ్ చేశాడని, కనీసం స్ట్రైక్ రొటేట్ కూడా చేయనీయలేదన్నాడు. అందుకే ఆదిల్ రషీద్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ అయ్యాడని తెలిపాడు సూర్య కుమార్ యాదవ్. ఇక బ్యాటింగ్ లో తాము ఇంకా మెరుగుపడాల్సి ఉందని.. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామన్నాడు.
మరోవైపు సూర్య కుమార్ యాదవ్ పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్ లో కూడా సూర్య 14 పరుగులు మాత్రమే చేశాడు. 2024లో టి-20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టి-20 క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కి భారత టి-20 క్రికెట్ జట్టు పగ్గాలు అప్పగించారు. అప్పటినుండి సూర్యకుమార్ నాయకత్వంలో భారత జట్టు 20 మ్యాచ్ లు ఆడింది.
ఇందులో 16 విజయాలను సాధించడం గమనార్హం. కానీ సూర్య కుమార్ యాదవ్ మాత్రం పేలవ ఫామ్ తో బాధపడుతున్నాడు. గత 13 మ్యాచ్ లలో సూర్య 24.57తో కేవలం 256 పరుగులు మాత్రమే చేశాడు. టి-20 క్రికెట్ లో జట్టును సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తున్న సూర్య.. బ్యాటింగ్ లో మాత్రం నిరాశపరుచుతున్నాడు. ఒక్కోసారి టచ్ లోకి వచ్చినట్లు కనిపించినా.. వాటిని బిగ్ స్కోర్స్ గా మలచలేకపోతున్నాడు. దీంతో సూర్య అభిమానులు కూడా నిరాశకు గురవుతున్నారు.
అయితే సూర్య ఫామ్ దిగజారడానికి ప్రధాన కారణం అదనపు బాధ్యత అని విశ్లేషిస్తున్నారు. సూర్య బ్యాటింగ్ ఫెయిల్యూర్ పై బోర్డు పెద్దలు కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సూర్య కుమార్ ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించబోతున్నట్లుగా పలు కధనాలు పేర్కొంటున్నాయి. కెప్టెన్సీ బాధ్యతలనుంచి సూర్య కుమార్ యాదవ్ ని తప్పించి.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారట.
Also Read: Travis Head: ఓపెనర్ గా వచ్చి రెచ్చిపోయిన హెడ్….టెస్టులు కూడా ఇక చూడాల్సిందే !
ఈ మేరకు ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే టి-20 కెప్టెన్సీ ఎంపిక సమయంలోను సూర్యని తాత్కాలిక కెప్టెన్ గానే నియమించింది బీసీసీఐ. రాబోయే టి-20 వరల్డ్ కప్ వరకు సూర్య ఆ పోస్టులో ఉంటాడని తెలిపింది. ప్రస్తుతం సూర్య తరచూ ఇలానే విఫలమైతే తిరిగి కొత్త కెప్టెన్ ని నియమించే అవకాశాలను కొట్టిపారేయలేం. సూర్య తిరిగి తన 360 డిగ్రీతో గాడిన పడతాడా..? లేక తన చేజేతులా బోర్డుకు అవకాశం ఇస్తాడా..? అన్నది వేచి చూడాలి.