హనీమూన్ హత్యలు ఎంత సీరియస్ మేటరో.. సోషల్ మీడియాలో ఈ సంఘటనలు అంత ఫన్నీగా మారిపోయాయి. సోషల్ మీడియాలో విపరీతమైన జోక్ లు పేలుతున్నాయి. బ్యాచిలర్స్ పెళ్లిళ్ల విషయంలో ఇటీవల బాగా భయపడిపోతున్నారని అంటున్నారు. అవును, నిజమే.. ఇటీవల పెళ్లాం తనను వదిలేసి వెళ్లిపోయిందని ఓ అభాగ్యుడు పండగ చేసుకున్నాడు. ఎందుకంటే తనను ప్రాణాలతో మిగిల్చి వెళ్లిపోయిందని బాధలో కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సమాధానం చెప్పాడు. అలాంటి రోజులివి. పెళ్లికి ముందు నేనంటే ఇష్టమేనా అంటే సిగ్గు ఒలకబోసిన పెళ్లికూతురు, పెళ్లైన తర్వాత ప్రాణం తీస్తుందని ఎవరైనా ఊహిస్తారా..? అలాంటి ఊహలే నేడు నిజం అవుతున్నాయి. పెళ్లానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే గోలచేయడం, పెద్దల దగ్గర పంచాయితీ పెట్టడం పాత పద్ధతి. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఎంక్వయిరీ చేసి, వారిద్దర్నీ కలపడం, తద్వారా తన ప్రాణాలు కాపాడుకోవడం నేటి భర్తల తక్షణ కర్తవ్యం. కాదని ఎవరైనా గొడవ చేసినా, గోల పెట్టినా, అదేంటని నిలదీసినా.. వారికి నెక్స్ట్ డే ఉంటుందని గ్యారెంటీ లేదు. ఒకటా, రెండా ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
Marriages are scary now😨 pic.twitter.com/vVvGJbuHAe
— Fukkard (@Fukkard) June 24, 2025
హనీమూన్ హత్యలు. ఇటీవల కాలంలో ఈ కేటగిరీ దారుణాలు బాగా పెరిగిపోతున్నాయి. గతంలో నచ్చనిపెళ్లి చేస్తున్నారంటే పెళ్లి కూతురు కానీ, పెళ్లి కొడుకు కానీ ఇంట్లోనుంచి వెళ్లిపోయేవారు. తమకి నచ్చినవాడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత తిరిగి ఇంటికొచ్చేవారు. మొదట్లో తల్లిదండ్రులు కాస్త కోప్పడినా ఆ తర్వాత ఆదరించేవారు, కలసిపోయేవారు. అన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుందని చెప్పలేం కానీ, ఇలా జరిగితే సామాజికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలు పోయేంత పెద్ద నష్టాలు జరగవు. కానీ ఇటీవల ట్రెండ్ మారింది. నచ్చకపోయినా పెళ్లి చేసుకుంటున్నారు, ఆ తర్వాత నచ్చినవాడితో వెళ్లేందుకు అమాయకుడైన భర్తను బలిచేస్తున్నారు. ఇవే హనీమూన్ హత్యలు.
Marriage is scary 😟 pic.twitter.com/m1rf1Nsgh0
— Raja 🇮🇳 (@Raja15975) June 24, 2025
వదిలి వెళ్లాలా..? చంపేయాలా..?
ఒకటా రెండా, ఇటీవల కాలంలో ఈ ఉదంతాలు కోకొల్లలు. ఒకరు మర్డర్ చేసి డ్రమ్ములో పెట్టేస్తారు, ఇంకొకరు హత్య చేసి కాల్వలో పడేస్తారు, మరొకరు తన చేతికి మట్టి అంటకుండా సుపారీ గ్యాంగ్ కి పని అప్పజెబుతారు. భార్య, భార్య ప్రియుడు ఈ క్రైమ్ లో కీలకం. భర్త నచ్చకపోతే వదిలి వెళ్లిపోవాలా..? లేక చంపేయాలా..? ఏంచేయాలా అని ఆలోచిస్తున్నారు కొంతమంది కొత్త పెళ్లికూతుళ్లు. హంతకురాలు కాకూడదు అనుకుంటే భర్తని వదిలేసి మరొకరితో జంప్ అవుతున్నారు. భర్త ప్రాణాలతో ఉండటం ఎందుకు అనుకుంటే అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నుతున్నారు. ఎలాంటి తప్పు చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడటం సహజం, పోలీసులకు దొరకడం, జైలు జీవితం.. ఏవీ తప్పవు. జైలుకెళ్లడం గ్యారెంటీ అని తెలిసినా కూడా వీళ్లంతా ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారనేదే ఇక్కడ అసలు ప్రశ్న.
🙏 In India Marriage System collapsed 🙏
Marriage is Scary after #SonamRaghuvanshi Murder plan at Honeymoon,
Nowadays following Indian Women killed their husband's
1.Sonam,2.Nikitha,3.Muskan,4.Manika,5. Pragati, 6. Pratima Since 2024 to 2025 these Murders #MarriageStrike pic.twitter.com/0dXYPojwDD— Prerna (@prernaMRA) June 18, 2025
అదొక ఆప్షన్ ఉంది తెలుసా?
భార్యకి భర్త నచ్చకపోయినా, భర్తకి భార్య నచ్చకపోయినా విడాకులు అనే ఒక ఆప్షన్ ఉందనే విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని అంటున్నారు నెటిజన్లు. భర్త నచ్చకపోయినా, నచ్చినవాడితో వెళ్లిపోవాలనే ఆలోచన ఉన్నా.. చట్టప్రకారం విడిపోతే సరిపోతుంది కదా అని సలహా ఇస్తున్నారు. అంత ఓపిక, తీరిక లేక నేటితరం సుపారీ హత్యల్ని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ సంబంధాల మోజులో జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది యువతులు.
Marriage is scary pic.twitter.com/eUEuXrK1Sb
— RelatableAFzone (@RelatableAFzone) June 18, 2025
హంతకురాలు అనే ముద్రపడితే సమాజం ఎలా చూస్తుంది, ఎలా బతకాలి, జైలుకెళ్తే కుటుంబం పరిస్థితి ఏంటి అనే విషయాలను ఆలోచించడంలేదు. ప్రియురాలి కళ్లలో ఆనందం కోసం తనకు ఏమాత్రం సంబంధం లేని అమాయకులను హత్య చేస్తున్న ప్రియుళ్లు కూడా ఈ విషయంలో ఆలోచించాలి. హంతకులుగా మారితే అసలు జీవితమే ఉండదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.