BigTV English

Viral Video: భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో మిస్ ఆస్ట్రేలియా రాంప్ వాక్..

Viral Video: భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో మిస్ ఆస్ట్రేలియా రాంప్ వాక్..

Viral Video: భారతదేశంలో సంప్రదాయ దుస్తులకు ఓ చరిత్రే ఉంది. పూర్వకాలం నుంచి చీర, పంచె వంటి సంప్రదాయమైన దుస్తులను ధరించడం భారతదేశంలో వస్తున్న ఆనవాయితీ, ఆచారం, సంస్కృతి. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న యువత చీర కట్టుకు కాస్త చిన్నచూపు చూస్తోంది.


చీరలో కనిపిస్తే నవ్వుతారని, జీన్స్, చుడిదార్లు ధరిస్తూ పాశ్చాత్య దేశాల్లో తిరుగుతున్నారు. అయితే మన దేశస్తులు విదేశీ కట్టుబాట్లను పాటిస్తుంటే, విదేశీయులు మాత్రం భారతీయ కట్టుబాట్లకు అలవాటు పడుతున్నారు. భారతీయుల వస్త్రాధరణపై మక్కువ పెంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఏకంగా ఓ విదేశీ సుందరి తన ర్యాంప్ వాక్ లో భారతీయ సంప్రదాయ దుస్తువులో ఒకటైన చీరను ధరించి కనిపించింది.

ఇటీవల ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ 2024 వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మిస్ ఆస్ట్రేలియా భారతీయ వస్త్రాధరణతో ర్యాంప్ వాక్ చేసింది. అద్భుతమైన చీర కట్టులో వయ్యారాలను వొలకబోస్తూ ర్యాంప్ వాక్ చేసింది. అయితే ఆ విదేశీ యువతి వేషాధరణకు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కూడా ముగ్దురాలైంది.


ఏకంగా చప్పట్ల వర్షం కురిపించింది. అయితే ఆస్ట్రేలియాకు చెందిన యువతి చీరకట్టులో కనిపించగా.. భారతీయ యువతి మాత్రం గాగ్రాలో కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. విదేశీయులు మన వేషాధరణను ఇష్టపడుతుంటే మన దేశస్తులు మాత్రం విదేశీయ వేషాధరణను అవలంబిస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×