Maharaj Chef: మనం వంటవాళ్లను చూస్తే చాలా సార్లు “రోజుకి ఎంత?” అనే ప్రశ్నతో మొదలవుతుంది. కానీ ముంబయిలో ఒక కుక్ — ‘మహరాజ్’ అనే పేరుతో — కేవలం రోజుకి 30 నిమిషాలు పని చేసి, ఒక్కింటికే నెలకు ₹18,000 సంపాదిస్తున్నాడంటే? వినడానికి షాకింగ్ గా ఉన్నా, ఇది నిజంగా జరుగుతోంది. ఈ విషయాన్ని ఒక న్యాయవాది ఆయుషి దోషి సోషల్ మీడియాలో పంచుకున్న వెంటనే విపరీతంగా వైరల్ అయింది. కుక్ సంపాదనపై కాదు, జీవితం అంటే ఏంటి అనే పెద్ద చర్చను కూడా ఇది తెరపైకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ మహరాజ్ ఎవరు? ఎంత సంపాదిస్తున్నాడు?
కుక్ ఒక్కింటికీ నెలకు ₹18 వేలా..
ఒక న్యాయవాది ఆయుషి దోషి తన కుక్ గురించి ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తుంది. ముంబయిలో ఉన్న ఆమె ఇంటి కుక్ ఒక్కింటికీ నెలకు ₹18,000 తీసుకుంటాడట. అదీ కేవలం రోజుకు 30 నిమిషాల పనికే! ఈ విషయం వినగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. మరికొందరు నమ్మలేక కామెంట్లలో “ఇది ఫేక్” అని రాసారు. కానీ ఆయుషి మాత్రం ఇది ముంబయి.. వాస్తవం అని చెబుతున్నారు. ఆయుషి చెప్పినట్టుగా, ఆ కుక్ ఒకే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో 10–12 ఇళ్లకు వంట చేస్తాడు. ప్రతి ఇంట్లో ఎక్కువగా 30 నిమిషాలు ఉండేవాడు. కొన్ని పెద్ద కుటుంబాలుంటే 60 నిమిషాల వరకూ ఉండేవాడు. అందులో ప్రయాణ ఖర్చు లేదు, సమయ నష్టం లేదు. ఫ్రీగా చాయ్, భోజనం కూడా లభ్యమవుతాయంట. అంతే కాకుండా, డబ్బులు టైమ్‌కి రాకపోతే ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతాడట.
నో కామెంట్..
ముంబయిలోని మంచి కాలనీల్లో నైపుణ్యం ఉన్న వంటవాళ్లకు ఇదే రేటు అన్నది ఆమె చెప్పే పాయింట్ అదో టాలెంట్. మామూలుగా 10 నుండి 12 వేల మధ్య రేటు ఉంటుంది. కానీ ఎవడైనా పదేళ్లుగా విశ్వాశంగా పని చేస్తూ.. త్వరగా రుచిగా వండితే వారు ప్రీమియం ఛార్జ్ చేస్తారు. ఆ మహరాజ్‌కి అంత నమ్మకం, పేరు ఉంది కాబట్టే అందరూ విన్నవించుకుంటున్నారు,” అని ఆమె స్పష్టం చేశారు. ఇంత చెప్పినా కొంతమంది మాత్రం “ఇది ఎంగేజ్‌మెంట్ ఫార్మింగ్ కాదు?” అని అడిగారు. ఆమె కౌంటర్‌లో “ఇది నిజమైన అనుభవం. ముంబయిలో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి. నమ్మకపోతే ట్వీట్ చదవడం మానేయండి కానీ ఫేక్ అన్న కామెంట్లు పెట్టొద్దు” అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.
ఈ కథ మనకు నేర్పే పాఠం..
ఆమె ఈ విషయాన్ని పంచుకున్న అసలు ఉద్దేశం మాత్రం వేరే. ఆమె చెప్పిన మాటల్లోనే – “ఇది కేవలం ఒక వంటవాడి ఆదాయం గురించి కాదు. అసలు విషయం – మనలో చాలా మంది బీటెక్, MBA చేసి, వర్క్ స్ట్రెస్‌తో, డెడ్‌లైన్స్‌తో, వీకెండ్‌ల్లూ పని చేస్తూ, తమ జీవితాన్ని త్యాగం చేస్తుంటారు. కానీ కొందరు స్కిల్డ్ వర్కర్లు – శారీరకంగా కష్టపడినా – వారి టైం, జీవితం అన్నిటిని కంట్రోల్‌లో పెట్టుకుని ప్రశాంతంగా జీవిస్తున్నారు. అది చూసి తేడా ఏమిటో మనం అర్థం చేసుకోవాలి.” ఈ కథ మనకు నేర్పే పాఠం ప్రతి వృత్తికి విలువ ఉంది. మనం చేసే పని LinkedIn ప్రొఫైల్ ఉన్నది కాదని చిన్నచూపు చూడకూడదు. నిజమైన విలువ నైపుణ్యంలో ఉంటుంది. ఎవరి పని అయినా, వారు దాన్ని సమర్థవంతంగా చేస్తే – ఆ పనికి గౌరవం, ఆదాయం రెండూ వస్తాయి. మనం పని చేసే విధానం, సమయాన్ని ఎలా వినియోగించుకుంటామన్నదే అసలు విషయమని ఈ సంఘటన మనకి స్పష్టంగా చూపించింది.