Today Gold Rate: బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం పెరిగిన బంగారం మళ్లీ తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,030 ఉండగా.. నేడు రూ.99,820 పలుకుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,700 ఉండగా.. నేడు రూ.91,500 వద్ద పలుకుతోంది. నేడు తులం బంగారంపై రూ.200 తగ్గిందని చెప్పుకోవచ్చు.
తగ్గిన బంగారం ధరలు..
అయితే బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు మళ్లీ బంగారం కొనాలనే ఆశ కల్పిస్తుంది. చాలా మంది బంగారం కొనాలంటే అమ్మో లక్ష.. అని బయపడుతున్నారు. కానీ, మళ్లీ తగ్గడంతో వారికి బంగారం పై ఆసక్తి పెరుగుతుంది. ఇలాగే తగ్గితే సామాన్య ప్రజలు కూడా వాటిపై మోగ్గు చూపుతారు. ఇంకా పెళ్ళిళ్లు, ఫంక్షన్లు వంటి కార్యక్రమాలు ఉన్నవారు బంగారం కొనడానికి ఇదే సరైన సమయం అని చెబుతున్నారు.
అంతర్జాతీయ పరిస్థితులు ప్రభావం
గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు, రష్యన్ ముడి చమురు కొనుగోలుకు జరిమానా విధించిన తర్వాత, ముడి చమురు ధరలు తగ్గడం, అనుమానాస్పద RBI జోక్యం మధ్య, రూపాయి విలువ దాని ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నుండి 22 పైసలు కోలుకుని US డాలర్‌తో పోలిస్తే 87.58కి చేరుకుంది. ఆగస్టు 1 గడువుకు ముందు వాణిజ్య ఒప్పందం లేనందున అమెరికా భారత దిగుమతులపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన తరువాత, బుధవారం రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే 87.80 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.
పలు ప్రాంతాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ నేటి బంగారం ధరలు
నిన్నటి బంగారంతో.. నేటి బంగారం ధరలు పోల్చగా నిన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,030 కాగా.. నేడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,820 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,700 కాగా.. నేడు రూ.91,500 పలుకుతోంది.
విశాఖపట్నం బంగారం ధరలు
విశాఖలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,820 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,500 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో బంగారం ధరలు
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,820 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,500 వద్ద ఉంది.
ముంభై బంగారం ధరలు
ముంభైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,820 కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,500 వద్ద పలుకుతోంది.
ఢిల్లీ బంగారం ధరలు
ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,970 కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,650 వద్ద పలుకుతోంది.
Also Read: ఎందుకిలా చేశానంటే.. ఫస్ట్ టైం నోరు విప్పిన డా. నమ్రత
నేటి సిల్వర్ ధరలు..
బంగారమే కాదు.. దానికి పోటీగా సిల్వర్ రేట్లు కూడా తగ్గుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,25,000 ఉండగా.. నేడు రూ.1,23,000 వద్ద పలుకుతోంది. అంటే కేజీపై 200 తగ్గిందని చెప్పవచ్చు. పలు ప్రాంతాల్లో కలకత్త, ఢిల్లీ, ముంభై ప్రాంతాల్లో రూ 1,13,000 వద్ద కొనసాగుతోంది.