Venu Swamy: వేణుస్వామి ఇలా చెప్పారు. అలా యుద్ధం ఆగింది. ఔను ఇదే అంటున్నారు నెటిజన్స్. ప్రముఖ జ్యోతిష్కులుగా పేరుగాంచిన వేణుస్వామి లక్ష్యంగా మళ్లీ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ఇంతకు వేణుస్వామి చెప్పిందేంటి? ఇప్పుడు ట్రోలర్స్ గురి వేణుస్వామి వైపు ఎందుకు మళ్లిందో తెలుసుకుందాం.
ప్రముఖ జ్యోతిష్కులు వేణు స్వామి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం వేణుస్వామి ప్రస్తుత ఇండియా – పాక్ మధ్య గల యుద్ధ పరిస్థితులపై ఆ వీడియోలో మాట్లాడారు. ఆ వీడియోలో తాను చెప్పిందే జరిగిందని చెబుతో మరో వీడియోను కూడా ప్లే చేయడం విశేషం. ఇంత వరకు ఓకే గానీ అలాగే వేణు స్వామి మాట్లాడుతూ.. మనదేశంకు పాక్ కు యుద్ధం జరుగుతుందని చెప్పిన ఏకైక వ్యక్తిని తానేనని చెప్పుకొచ్చారు.
మే 30 నుండి గ్రహాల కూటమి కారణంగా యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని, అన్నీ పెను సంచలనాలే జరుగతాయని జోస్యం చెప్పారు. మే 2025 నుండి 2028 వరకు, 2028 నుండి 2032 వరకు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుందన్నారు. 2032 నాటికి పాక్ 80 శాతం నాశనం అవుతుందని చెప్పారు. అయితే పాక్ నాశనం మనమందరం కోరుకొనేది కాబట్టి ఇంత వరకు ఓకే, అంతటితో ఆగని వేణుస్వామి పలువురు ప్రముఖులు, సినిమా నటులు చనిపోయే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా సునామీలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు వస్తాయని చెప్పారు.
ఇలా వేణుస్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మధ్యాహ్నం వేణుస్వామి వీడియో విడుదల చేయడం వరకు ఓకే, సాయంత్రం మన దేశంతో పాటు పాక్ కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇక అంతే వేణుస్వామి లక్ష్యంగా ట్రోలర్స్ మళ్లీ మొదలు పెట్టారు. యుద్ధం ఆగుతుందని తమకు ఎప్పుడో తెలిసిందని, వేణుస్వామి యుద్ధం తీవ్రతరం అన్నప్పుడే తమకు అర్థమైందని కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. వేణుస్వామి భవిష్యత్ గురించి చెప్పిన మాటలు ఇక వట్టి మూటలేనని మళ్లీ ఇలాంటి జోస్యం చెప్పవద్దని కొందరు లైన్ దాటి మరీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Miss World 2025: కన్నులవిందుగా మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం.. వైరల్ వీడియో
పాక్ నాశనం కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారని, కానీ సినిమా నటులు, ప్రముఖులు మరణిస్తారని వేణుస్వామి చెప్పడంపై కొందరు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు దయచేసి జోతిష్యం చెప్పడం మానుకోండి.. జరిగేది జరగక మానదు స్వామి అంటూ కొందరు సలహాలు ఇవ్వడం విశేషం. ఇప్పటికే ఏపీ ఎన్నికల సమయంలో, అక్కినేని వారి ఇంట నిశ్చితార్థం సమయంలో వేణుస్వామి చెప్పిన భవిష్యంపై పెద్ద రచ్చ సాగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చెప్పిన కొద్దిగంటల్లోనే కాల్పుల విరమణ ప్రకటన రావడంతో వేణుస్వామి మళ్లీ సోషల్ మీడియాలో టార్గెట్గా మారారని చెప్పవచ్చు. మరి ఈ ట్రోలింగ్స్ కు వేణుస్వామి సీరియస్ గా రెస్పాండ్ అవుతారా? లేక ఉన్నది చెప్పాను నాకెందుకు అంటూ వదిలేస్తారా అన్నది మున్ముందు తెలిసే అవకాశం ఉంది.