Viral Video Odisha: ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలపై.. ఒడిశాలో అమానవీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాయగడ జిల్లాలో ఇటీవల జరిగిన ఘటన మరువకముందే.. మరొకటి చోటుచేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటను నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ.. పొలం దున్నించి ఆచారం ప్రకారం శుద్ధిచేశారు. తాజాగా ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కోరపుట్ జిల్లా నారాయణపట్నం సమితి పరిధిలోని భైరాగి పంచాయతీలో ఈ దారుణం జరిగింది.
ఘటన వివరాలు – ప్రేమించారన్న కారణంగా శిక్ష
పెద్దఇటికి గ్రామానికి చెందిన యువకుడు, యువతి గతంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారు వంశ పరంగా అన్నా చెల్లెళ్ళు కావడంతో, ఈ సంబంధాన్ని గ్రామ పెద్దలు అంగీకరించలేదు. అయితే వీరు కొన్ని సంవత్సరాల క్రితం ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అనంతరం వేరే ఊరిలో జీవితం కొనసాగిస్తూ ఉండగా, కుటుంబసభ్యులు గ్రామంలో అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేస్తామని పిలిపించారు. అయితే గ్రామపెద్దలు ఒప్పుకోలేదు. ఒకే వంశంలో వివాహం చేయడం విరుద్ధమని అభ్యంతరం చెప్పి.. గ్రామ శిక్షకు కట్టుబడి ఉండాలన్నారు. గ్రామ ఆచారాలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో.. వారికి గ్రామ శిక్ష విధించారు. వీరిద్దరిని ఎద్దుల్లా నాగలికి కట్టి, బహిరంగంగా పొలంలో దున్నించారు. అంతటితో ఆగకుండా, ఈ ప్రక్రియను శుద్ధి కార్యక్రమంగా అభివర్ణిస్తూ గ్రామసమక్షంలో లాఠీలతో కొట్టించారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఒకటొక్కటిగా బయటకొస్తున్నాయి. వీడియోల్లో భార్యాభర్తలు ఇద్దరు బంధించబడి, శారీరకంగా హింసకు గురవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామ ఆచారాల పేరుతో హింస న్యాయమా?
ఈ ఘటన మరొకసారి గ్రామ పంచాయతీ లీడర్లపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే వంశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడ్డారన్న.. ఒక్క కారణంతో శారీరకంగా హింసించటమా? అది న్యాయమా? పంచాయతీలకు న్యాయవిధానం నిర్ణయించే అధికారముందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అధికారుల స్పందన – దర్యాప్తు జరుగుతోంది
ఈ ఘటనపై అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. ఇప్పటివరకు పోలీసులకు అధికారిక ఫిర్యాదు అందలేదని పేర్కొంటూనే, వీడియో ఆధారంగా గ్రామానికి వెళ్లి వివరాలు తెలుసుకుని.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత జంటకు రక్షణ కల్పించే విషయాన్ని కూడా అధికారులు హామీ ఇచ్చారు.
Also Read: బైక్‌పై హగ్గులు, కిస్‌లు.. అరేయ్ ఏంట్రా ఇది
ప్రేమించారన్న ఒక్క కారణంతో శిక్షించడం న్యాయవంతమైనదా? గ్రామపు ఆచారాల పేరుతో అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎంతకాలం తట్టుకోవాలి? ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే, ఇకపై ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట పడుతుంది. సమాజంలో ప్రేమను అపరాధం చేయకూడదని, ప్రేమించేవారిని గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మనకు గుర్తుచేస్తోంది.
మరో ప్రేమజంటపై అమానుషం!
ఒడిశా-రాయగడ జిల్లాలో ప్రేమజంటను నాగలికి ఎద్దుల్లాగా కట్టి పొలం దున్నించిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన
నాగలికి ఎద్దుల్లాగా కట్టి, కర్రలతో కొడుతూ పొలం దున్నించిన గ్రామ పెద్దలు
కోరాపుట్ జిల్లా నారాయణ పట్టణం సమితి బైరాగి పంచాయతీ పరిధిలో చోటు… https://t.co/YeBX4rqOzB pic.twitter.com/T1JxoBh1eR
— BIG TV Breaking News (@bigtvtelugu) July 14, 2025