Viral Video: పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు చిలక్కి చెప్పినట్టు చెప్పింది భారత్. మీ దేశం నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పింది. అబ్బే.. అబ్బెబ్బే.. అలాంటిదేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. సెలబ్రిటీ స్థాయి నేతలంతా ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్లు మాట్లాడేశారు.
భారత్‌ని రెచ్చగొట్టిన దాయాది దేశం
భారత్‌ని రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడారు. పాక్ రాజకీయ నేతలు, సైన్యం, క్రికెటర్లు, వివిధ విభాగాల విశ్లేషకులు సైతం ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్లు మాట్లాడేశారు. అప్పటికే 27 మందిని కోల్పోయి ఆగ్రహంతో ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఓవైపు మాటలకు పని చెబుతూ, మరోవైపు సరిహద్దు వెంబడి కయ్యానికి కాలు దువ్వింది. ఆపై కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.
తమపై భారత్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఆదేశ మంత్రులు మాట్లాడారు. దాని ఫలితమే ఆపరేషన్ సింధూర్. సరిగ్గా మంగళవారం రాత్రి ఒంటి గంటన్నర తర్వాత త్రివిధ దళాలు మూకుమ్మడిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. ప్రస్తుతానికి 30 మంది ఉగ్రవాదులు మట్టుబెట్టినట్టు వార్తలు వస్తున్నా, ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.
ఉగ్ర స్థాపరాలపై మెరుపు దాడి
టెర్రరిస్టుల క్యాంపులపై మిస్సైల్ దాడులు చేసింది భారత సైన్యం. ఆ సమీపంలోని పాకిస్తాన్ ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించి వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే మిస్సైల్ పడిన ప్రాంతంలో టెంట్లలో చాలామంది ఉన్నారు. వాటిలో ఉన్నవారంతా బయటకు పరుగులు పెట్టారు. టెంటులో ఉన్నారంటే వాళ్లు కచ్చితంగా ఉగ్రవాదులేనని అంటున్నారు. వారు పరిగెత్తిన విధానం ఉగ్రవాదులను తలపిస్తోందని అంటున్నారు.
ALSO READ: దాడి చేస్తామని రాత్రి హింట్ ఇచ్చిన భారత్, ఆ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్కా
మరో వీడియోలో భవల్పూర్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. అదే సమయంలో దాయాది దేశానికి చెందిన కొందరు యువకులు వాహనాలపై అదే రోడ్డులో వెళ్తున్నారు. మిస్సైల్ దాడులను చూసి బిత్తరపోయారు. వాహనాలను కాసేపు అక్కడ ఆపి, ఆ దాడులను తమ ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ దాడులు చూసిన తర్వాత అక్కడి వాహనాలతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.
రోడ్లపై పాక్ యువత, వెనక్కి
భారత్ కాలమాన ప్రకారం రాత్రి ఒంటిగంటన్నర తర్వాత దాడి చేసిందని భారత్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమయం విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య గంట తేడా ఉంటుందని అంటున్నారు. అందుకోసమే ఆ సమయంలో అక్కడి యువత వాహనాలపై రోడ్ల మీద వెళ్తోందని అంటున్నారు. మిస్సైల్ దృశ్యాలు చూసిన ఆ యువకులకు రాత్రి నిద్ర పట్టలేదని సమాచారం.
దాడుల పరిస్థితి గమనించిన పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని అన్నారు. ఆ వెంటనే సరిహద్దు వెంబడి జమ్మూ లోని ఓ గ్రామంలో విరుచుకుపడ్డారు పాక్ సైన్యం. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా సమాచారం అందాల్సివుంది.
జనం పరుగులు.. ఉగ్రవాదులేనా?
పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ మిస్సైల్స్‌తో దాడులకు పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో పలు ఉగ్రస్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లోని ఓ భవనం నుంచి ప్రజలు పరుగులు తీస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.… pic.twitter.com/cZo1rRnII9
— ChotaNews App (@ChotaNewsApp) May 7, 2025
Operation Sindoor🙌🏻#IndoPakBorder
pic.twitter.com/TKQeevy5RF— G3 (@gayatri008_16) May 6, 2025