Samantha:గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు తమ అభిమాన హీరోయిన్లపై ప్రత్యేకమైన ఇష్టాన్ని చాటుకుంటూ.. వారి కోసం గుడిని కట్టిస్తూ ఆరాధ్య దైవంగా వారిని భావిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడుకు వెళ్తే.. కుష్బూ (Khushboo), హన్సిక (Hansika) తో పాటు ఎంతో మంది హీరోయిన్స్ కి అభిమానులు గుడి కట్టించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కు ఒక అభిమాని గుడి కట్టి ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో 2023లో ఒక చిన్నపాటి విగ్రహంతో, ఆ అభిమాని ఈ గుడిని నిర్మించారు. ఇక ఇటీవల పుట్టినరోజు సందర్భంగా అనగా ఏప్రిల్ 28 రోజున ఆ గుడిలో గోల్డెన్ కలర్ లో సమంత విగ్రహాన్ని పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమంతకు గుడి కట్టిన అభిమాని..
అంతేకాదు పలువురు అనాధ పిల్లలకు, ఆ అభిమాని భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయం కాస్త సమంత వరకు చేరడంతో తాజాగా ఈ విషయంపై సమంత స్పందించింది. అభిమాని తనకోసం గుడి కట్టారని తెలిసి ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ ఇలాంటివి ప్రోత్సహించడం కరెక్ట్ కాదని ఆగిపోయాను అంటూ సమంత తెలిపింది . ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సమంత తాజాగా ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్’ బ్యానర్ పై మొదటిసారి విడుదల చేస్తున్న చిత్రం ‘శుభం’. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల వైజాగ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంత.. అందులో భాగంగానే తనకు అభిమాని గుడి కట్టడంపై స్పందించింది.
తొలిసారి స్పందించిన సమంత..
సమంత మాట్లాడుతూ..” నాకోసం అభిమాని గుడి కట్టారని తెలిసి ఎంతో సంతోషపడ్డాను. కానీ ఆ అభిమానాన్ని గుడి రూపంలో చాటుకోవడం ప్రోత్సహించదగినది కాదు..ఇలాంటి చర్యలను నేను అసలు ప్రోత్సహించను. ముఖ్యంగా అభిమానులు తమ ప్రేమను సానుకూల మార్గాలలో, సమాజానికి మేలు చేసే విధంగా చూపించాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపింది. అంతేకాదు తనపై ఇంత ప్రేమను చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు కూడా తెలిపింది సమంత. ఇక ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శుభం సినిమా విషయానికి వస్తే.. సమంత తొలిసారి తన ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో అందరూ కొత్తవాళ్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ను తీసుకోవడం గమనార్హం. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రీయ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇకపోతే మొదటిసారి తన సినిమా ప్రొడక్షన్ బ్యానర్ పై హీరో హీరోయిన్ అని తేడా లేకుండా అందరికీ సమాన రెమ్యూనరేషన్ ఇస్తానని సమంత చెప్పి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో స్త్రీ , పురుష భేదాలు ఉన్నాయని పారితోషకం విషయంలో కూడా ఇదే జరుగుతోందని, ఇకపై ఇలాంటివి అరికట్టడానికి తాను ముందడుగు వేస్తున్నాను అంటూ కూడా సమంత తెలిపింది. ఇక సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Gauri Khan: పెళ్లయ్యాక ఆ హీరోయిన్ తో ఎఫైర్..గౌరీఖాన్ రియాక్షన్ ఇదే.!