Viral Video: ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో నటుడు రావుగోపాలరావు ఓ డైలాగ్ చెబుతున్నారు. మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలి లేకుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏ ముంటుందని చెబుతారు. సరిగ్గా ఆ డైలాగ్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు అతికినట్టు సరిపోతుందని అంటున్నారు నెటిజన్స్. డైలాగ్ అంటారు.. పాక్ పీఎం అంటారు? ఇంతకీ అసలు కథేంటి?
దాయాది దేశం పాకిస్థాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆయన టాలెంట్ బయటపడింది. ఓ వైపు పాక్ సైనికులు చావు దెబ్బ తిన్నా, తాము గెలిచామంటూ ఆదేశ ప్రజలను ఉత్సాహపరిచారు. ఓ అబద్దాన్ని నిజమని చెప్పగలిగే గొప్ప నేత కూడా. అప్‌కోర్స్ నాయకుడికి అలాంటి లక్షణాలు ఉండాలని అప్పుడప్పుడు కొందరు చమత్కరించుకుంటారు.
పాకిస్థాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ పాత వీడియో వైరల్ ఏంటి? అనేది మీ డౌట్ అక్కడికే వచ్చేద్దాం. రెండేళ్ల కిందట నాటి ఓ ఫంక్షన్‌లో వీడియో తాజాగా వైరల్ అయ్యింది. సరిగ్గా.. 2023లో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లోని గవర్నర్ హౌస్‌లో ఓ కార్యక్రమం జరిగింది.
ఆ ఈవెంట్‌కు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఆ సమయంలో బాలీవుడ్ నటి మావ్రా హోకానేకు ఆయన అవార్డు ఇస్తున్న వీడియో తాజాగా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నుంచి అవార్డు తీసుకుని బాలీవుడ్ నటి మావ్రా హుస్సేన్ వెళ్తోంది. ఆమెని తన కళ్లు ఆర్పకుండా డీప్‌గా స్కానింగ్ చేశారు పీఎం షెహబాజ్.
ALSO READ: ఫ్లయిట్‌లోకి కంగారూ.. ప్యాసింజర్లు పరేషాన్
ఆనాటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని వెనుక అసలు ఏం జరిగింది? షాబాజ్ షరీఫ్ అవార్డు ఇచ్చే సమయంలో మావ్రా హోకానేను డీప్ స్కాన్ అనే క్యాప్షన్‌తో రెండేళ్ల కిందట ఆదేశానికి చెందిన ఓ టీవీ ఛానెల్ ఈ వీడియోను షేర్ చేసింది. హీరోయిన్ మావ్రా హోకానే 2016లో సనమ్ తేరీ కసమ్ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
తన సహ నటుడు హర్షవర్ధన్ మూవీలో మావ్రా నటింపజేస్తే తాను సీక్వెల్‌లో భాగం కాబోనని ప్రకటనతో ఆమె వార్తల్లోకి వచ్చింది. పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను హీరోయిన్ మావ్రా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో మావ్రాపై హర్షవర్ధన్ రాణేపై ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో మ్యూజిక్ యాప్స్‌లో సనమ్ తేరీ కసమ్ డిజిటల్ పోస్టర్ల నుంచి మావ్రా హోకానేను తొలగించాడు.
Apparently Shehbaz Sharif is not that Sharif 😂😂 pic.twitter.com/RzzitJgJlI
— Cabinet Minister, Ministry of Memes,🇮🇳 (@memenist_) May 28, 2025