Telangana BJP: పేరుకే క్రమశిక్షణ కలిగిన పార్టీ. అక్కడ జరిగేదంతా చిల్లర రాజకీయాలేనా అనిపిస్తుంటుంది. పదేళ్లుకు పైగా కేంద్రంలో పవర్ అనుభవిస్తోంది. జాతీయ నాయకత్వం నిఖార్సుగానే ఉంటుంది. తెలంగాణ నేతలే గిల్లికజ్జాలు, గ్రూపులు, అధిపత్య పోరుతో.. పరువు తీసుకుంటుంటారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆ పార్టీకి ఎప్పుడూ ముళ్ల కిరీటమే. ఆ సీటు చుట్టూ తరుచూ కుమ్ములాటలే. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అధ్యక్ష మార్పుపై ప్రచారం జరుగుతూనే ఉంది. ఏడాది గడుస్తున్నా.. కొత్త ప్రెసిడెంట్‌ను పిక్ చేసుకోలేక పోయింది కమలదళం. కారణం.. నేతల మధ్య కొట్లాటలే. గ్రూపిజం. బాసిజమే. లేటెస్ట్‌గా బీజేపీ బిగ్ బాస్ సీటుపై గోషామహల్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.
కిషన్‌రెడ్డి స్మూత్. ఆయనపై కేసీఆర్‌కు క్లోజ్ అనే ముద్ర ఉంది. ఆయన ఉంటే బీజేపీ బలపడటం కష్టం అనే వారి సంఖ్య ఎక్కువే. అందుకే, ఆయన్ని మార్చాలనేది చాలమంది మాట. అధినాయకత్వమూ అందుకు రెడీగా ఉన్నట్టుంది. కానీ, ఆ మారే నాయకుడు ఎవరనేదే క్లిష్టంగా మారింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్.. ఈ నలుగురి చుట్టే ప్రధానంగా కుర్చీలాట. బండి, ఈటల రెండు గ్రూపులుగా విడిపోయారనేది ఓపెన్ సీక్రెట్. బండికి రాజాసింగ్.. ఈటలకు రఘునందన్.. మద్దతుదారుల మాటలతో కమలం పార్టీలో మంట ఎగిసిపడుతోంది.
కొత్త అధ్యక్షుడిపై కొత్త కిరికిరి!
త్వరలోనే తెలంగాణ స్టేట్‌కి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారంటూ రాజాసింగ్ లేటెస్ట్ స్టేట్‌మెంట్. అక్కడితో ఆగలేదాయన. కాంట్రవర్సీ యాడ్ చేశారు. ప్రెసిడెంట్‌ను ఫైనల్ చేసేది స్టేట్ కమిటీనా? సెంట్రల్ కమిటీనా? అంటూ.. స్టేట్ కమిటీనే అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే వచ్చే నాయకుడు రబ్బర్‌స్టాంప్ లానే మిగిలిపోతాడంటూ చిచ్చు పెట్టారు. పరోక్షంగా కిషన్‌రెడ్డి తన మనిషిని ఆ సీట్లు కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది రాజాసింగ్ కడుపుమంటలా కనిపిస్తోంది.
Also Read : రేవంత్ లాజిక్‌తో మోదీకి బైండ్ బ్లాక్!
గతంలో ఉన్న అధ్యక్షులంతా గ్రూపులు మెయిన్‌టైన్ చేసి పార్టీకి నష్టం చేశారని రాజాసింగ్ మండిపడ్డారు. తనలాంటి నాయకులను తొక్కేశారని.. మంచి నేతల చేతులు కట్టేసి, నోర్లు మూయించేసి.. కొంతమంది బడా లీడర్లు బాసిజం ప్రదర్శిస్తున్నారంటూ సంచలన ఆరోపణలే చేశారు. సీఎంలతో బ్యాక్‌డోర్ మీటింగ్స్, ప్రత్యర్థి పార్టీల నేతలతో సీక్రెట్ మిలాఖత్‌లు కాకుండా.. సరైన ఫైర్ బ్రాండ్ లీడర్‌ను పార్టీ ప్రెసిడెంట్ చేసి.. ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో బీజేపీకి తిరుగుండదనేది ఆయన సలహా. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ గురించేనంటూ ఆ పార్టీ వర్గాల్లో రచ్చ నడుస్తోంది.
బండి సంజయ్ మాటలకు అర్థాలే వేరా?
మరోవైపు.. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేసులో లేనని బండి సంజయ్ అన్నారు. తనకు ఆ కోరికా లేదని.. కేంద్ర సహాయ మంత్రి పదవితో హ్యాపీగానే ఉన్నానని.. పార్టీ ఏ బాధ్యత ఇస్తే అది నెరవేరుస్తానని చెప్పారు. సోషల్ మీడియోలో ప్రచారం జరిగినంత మాత్రాన పదవులు రావని తెలిపారు. ఇలా ఒకేరోజు రాజాసింగ్, బండి సంజయ్‌లు చేసిన కామెట్లు చూస్తుంటే.. అధ్యక్ష పదవి వారి చేతుల్లోంచి జారి పోయినట్టేనా?