Weight Gain: ప్రస్తుతం కొంత మంది బరువు ఎక్కువగా ఉన్నామని బాధపడుతుంటే .. మరికొందరు తక్కువ బరువు ఉన్నామని ఇబ్బంది పడుతున్నారు. ఉండాల్సిన దాని కన్నా తక్కువ బరువు ఉన్నా కూడా సమస్యే. సన్నగా ఉన్న వారిని చాలా మంది ఆటపట్టిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారు ఈజీగా బరువు పెరగాలని అనుకుంటే మాత్రం కొన్ని రకాల టిప్స్ తప్పకుండా పాటించాలి. ఇంట్లోనే రెగ్యులర్ గా ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారు. మరి బరువు పెరగడానికి ఎలాంటి టిప్స్ ప్రభావ వంతంగా పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు పెరగడం కోసం సరైన పోషకాహారం తినాలి. బరువు పెరగడానికి, మీ శరీరానికి రోజువారీ అవసరాల కంటే ఎక్కువ కేలరీలను అందించడం చాలా ముఖ్యం. దీంతో పాటు, ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి పోషకాల సమతుల్యతను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం.
బరువు పెరగడానికి పాలు, నెయ్యి, బాదం, పసుపు పాలు, అరటిపండు, వేరుశనగలు, వెన్న, డ్రై ఫ్రూట్స్ , స్మూతీస్ వంటివి తప్పకుండా తినాలి. వీటన్నింటిలో కేలరీలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు ఉంటాయి. హోం రెమెడీస్‌తో పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వును పెంచుకోవచ్చు.
బరువు పెరగడానికి ఇవి తినండి :
పాలు, నెయ్యి: పాలలో ప్రోటీన్ , కాల్షియం ఉంటాయి. నెయ్యి కూడా ఆరోగ్యకరమైన కొవ్వుల మూలం. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగాలి. ఇది మీ బరువును పెంచడంలో సహాయపడుతుంది.
బాదం: బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు , ఫైబర్ ఉంటాయి. ప్రతిరోజు నిద్రపోయే ముందు 5-6 బాదంపప్పులను తినడం వల్ల మీ బరువు పెరగడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
పసుపు పాలు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి పాలతో కలిపినప్పుడు నిద్ర, బరువు పెరగడానికి సహాయపడుతుంది. ప్రతి రాత్రి గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు బరువు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
అరటిపండు: అరటిపండులో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం టిఫిన్ లేదా భోజనాల మధ్య అరటిపండు తినడం వల్ల అవసరమైన శక్తి లభిస్తుందిజ అంతే కాకుండా అరటి పండు ఈజీగా బరువు పెరగడంలో మీకు సహాయపడుతుంది.
పీనట్ బటర్: పీనట్ బటర్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు , కేలరీలు ఉంటాయి.ఇది మీకు అదనపు కేలరీలను అందిస్తుంది. ఫలితంగా బరువు పెరిగేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read: మీ చర్మం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి
డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, వాల్‌నట్స్ , ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌లో కొవ్వు, కార్బోహైడ్రేట్లు , ప్రోటీన్లు ఉంటాయి. రోజు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీ బరువు పెరుగుతుంది. అంతే కాకుండా ఇవి తినడం మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
స్మూతీస్: పండ్లు, పాలు ,నట్స్ మీ శరీరానికి అవసరమైన కేలరీలను అందిస్తాయి. ఉదయం లేదా మధ్యాహ్నం అరటిపండు ,వేరుశనగ వెన్న వంటి వాటితో తయారు చేసిన స్మూతీస్ తినడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారు. అంతే కాకుండా వీటిని తరచుగా తినడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు