రైల్వే ప్రయాణాల్లో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా దొంగలు రెచ్చిపోతారు. క్షణాల్లో విలువైన వస్తువులను మాయం చేస్తారు. అందుకే, రైలు ప్రయాణం చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దొంగలు ఎక్కువగా కిటికీ పక్కన కూర్చున్న వాళ్లను టార్గెట్ చేస్తుంటారు. సెల్ ఫోన్లు, ఒంటి మీద ఉన్న నగలను కిటికీ లో నుంచి చేయిపెట్టి లాక్కెళ్తారు. తాజాగా అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగింది. అయితే, దొంగ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అడ్డంగా బుక్కయ్యాడు. రైలుకు వేలాడుతూ నరకనం అనుభవించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాన్ఫూర్ రైల్వే స్టేషన్ లో ఘటన
తాజాగా ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్ఫూర్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఓ రైలు కదిలేందుకు రెడీగా ఉన్న సమయంలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. రైలు కదిలే సమయంలో ఓ దొంగ కిటికీ లోకి చేతులు పెట్టి రైల్లోని వస్తువులు కొట్టేయాలనుకున్నాడు. అయితే, వెంటనే ప్రయాణీకులు అలర్ట్ అయ్యారు. దొంగ చేతులను గట్టిగా పట్టుకున్నారు. అప్పటికే రైలు కదలడం మొదలయ్యింది. ఎటూ తప్పించుకోలేక కిటికీని పట్టుకుని అలాగే వేలాడుతూనే ఉన్నాడు. వదిలితే ప్రాణాలు ఎక్కడపోతాయోనని నరకయాతన అనుభవించాడు.
దొంగ కింద పడకుండా పట్టుకున్న ప్రయాణీకులు
దొంగతనం చేయాలని చూసినప్పటికీ, ప్రయాణీకులు మానవత్వంతో వ్యవహరించారు. కింద పడకుండా చేతులు పట్టుకున్నారు. అయితే, ఆ దొంగ ముఖంలో ఎలాంటి బాధ కనిపించలేదు. దొరికి పోయానే అనే భయం లేదు. సీట్లను ఆటుకున్నట్లుగా కనిపించాడు. అతడి వాలకం చూసి ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. దొరికినా ఇంత భయం లేదు ఈ దొంగ వెధవకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దొంగ అలాగే వేలాడుతూ చాలా దూరం వెళ్లినట్లు ఆ వీడియో కనిపిస్తున్నది. చివరకు కొంత మంది చైన్ లాగి పోలీసులకు అప్పగించాలని భావించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: దేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు.. గంటకు దీని వేగం ఎంతో తెలుసా?
ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు
అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “నెక్స్ లెవల్ ఛోర్” అని ఒకరు కామెంట్ పెట్టగా, “ఛోర్ ప్రో మ్యాక్స్” అంటూ మరొకరు రాసుకొచ్చారు. “దొంగ అయినప్పటికీ ప్రయాణీకులు అతడి పట్ల చూపించిన మనవత్వం చాలా గొప్పగా ఉంది” అని మరికొంత మంది కామెంట్స్ పెట్టారు. ఇక ఈ వీడియోకు సోషల్ మీడియాలో ఏకంగా 3.5 మిలియన్ వ్యూస్ లభించాయి. 79 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. గతంలోనూ ఓసారి ఇలాగే దొంగ కదులుతున్న రైల్లోని మహిళ మెడలో గొలుసు లాగేందుకు ప్రయత్నించగా ప్రయాణీకులు పట్టుకున్నారు. అయితే, వెంటనే ప్రయాణీకులు ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రైలు ఆగింది. సదరు దొంగను పోలీసులకు అప్పగించారు. కానీ, ఇప్పుడు ఈ దొంగ రైలుకు వేలాడుతూ వెళ్లాడు.
Read Also: దేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్, రోజూ ఇక్కడ రైళ్లు కూడా ఆగుతాయండోయ్!