Soft Drink Cost – IPL 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025.. క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఈ ఐపీఎల్ మార్చి 22 నుండి ప్రారంభమైంది. ఈ ఐపీఎల్ లోని మ్యాచ్ ల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ల కోసం ఎంత ఖర్చైనా భరిస్తూ మైదానాలకు వెళుతున్నారు.
Also Read: Rajasthan Royals: రాజస్థాన్ కొంపముంచిన ఐపిఎల్ రూల్స్… ప్లేయర్స్ అందరి పైన వేటు
దిగువ స్థాయి టికెట్లు బ్లాక్ మార్కెట్లో 10 రెట్లు అధిక ధరకు అమ్ముడు అవుతున్నాయంటే.. ఈ ఐపీఎల్ మ్యాచ్ లకు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్ ల కోసం అధిక ధరలకు టికెట్లు కొని మైదానాలకు వెళ్లిన అభిమానులకు.. ఈ మ్యాచ్ ల నిర్వహకులు మైదానంలో కూడా షాక్ ఇస్తున్నారు. మైదానంలో కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ధరలు {Soft Drink Cost – IPL 2025} నిబంధనల మేరకు విక్రయించకుండా.. వారి ఇస్టారీతిన అమ్మకాలు జరుపుతున్నారు అంటూ మండిపడుతున్నారు క్రికెట్ ప్రేమికులు.
మైదానంలో ఒక్కో కూల్ డ్రింగ్ ధర ఏకంగా 250 రూపాయలకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 రూపాయలకు దొరికే కూల్ డ్రింక్ ని.. ఏకంగా 250 రూపాయలకు విక్రయిస్తూ.. 210 రూపాయల ఆదాయాన్ని అర్జిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బయట పది రూపాయలకు దొరికే ఒక్కో సమోసాని 50 రూపాయలకి, 200 గ్రాముల బిర్యానీని 250 రూపాయలకి, ఎగ్ పఫ్ 50 రూపాయలకి.. ఇలా అడ్డగోలు ధరలతో అభిమానులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఈ ధరలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ అభిమాని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ధరలపై అధికారులు చర్యలు తీసుకుంటారా..? లేదా..? అన్నది వేచి చూడాలి. ఇక ఈ {IPL 2025} సీజన్ లో ఎవరు ఊహించని జట్లు పాయింట్ల పట్టికలో మొదటి స్థానాలలోకి దూసుకు వెళుతుంటే.. టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న జట్లు మాత్రం లిస్టులో చివరి స్థానాలలో కూర్చున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది.
Also Read: Riyan parag: రియాన్ పరాగ్ ఔట్ పై వివాదం.. ఫిక్సింగ్ జరిగిందా
కొత్త కెప్టెన్ రిజత్ పటిదార్ సారథ్యంలోని ఆర్సిబి ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లలో.. మూడింట విజయం సాధించింది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు టాప్ లో నిలవగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ స్థానంలో నిలవగా.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కింది నుంచి రెండు, మూడు, నాలుగు స్థానాలలో నిలిచాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">