BigTV English

Office Zoom Meeting Call in Traffic: రోడ్డుపై బైక్ నడుపుతూ ఆఫీసు జూమ్ మీటింగ్ కాల్.. ‘మా సాఫ్ట్‌వేర్ కష్టాలు మీకేం తెలుసు బ్రో’

Office Zoom Meeting Call in Traffic: రోడ్డుపై బైక్ నడుపుతూ ఆఫీసు జూమ్ మీటింగ్ కాల్.. ‘మా సాఫ్ట్‌వేర్ కష్టాలు మీకేం తెలుసు బ్రో’

Viral Video


Man Attends Zoom Call in Laptop While Riding on Bike in Bengaluru: ప్రస్తుత కాలంలో ఉద్యోగం అనేది నిత్యావసర వస్తువులా మారిపోయింది. చదువుకున్నాక ఉద్యోగం లేదు, రాలేదు అంటే అందరికీ చిన్న చూపే. అందుకే కొందరు ఇష్టంతో ఉద్యోగంలో చేరుతారు.. మరి కొందరు తప్పక ఉద్యోగంలో చేరుతారు. వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత కష్టమైనా సరే అనుకున్న సమయానికి పై అధికారులు అప్పగించిన పని చేయాల్సి ఉంటుంది. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో ఈ తలనొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఈ వీడియో ఓ చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు..

జనరేషన్ జెడ్ యువత జీతం వేటలో పడి జీవితాన్ని పనంగా పెడుతున్నారు. పై అధికారులు తమకు అప్పగించిన పని చేయడం కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధం అయిపోతున్నారు. అయితే ఇటీవలే బెంగళూరులో ఓ యువకుడు చేసిన పనికి జీతం కోసం ఇలా కూడా చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే అతనిపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..


మార్చి 23వ తేదీనా నిత్యం బిజీగా ఉండే బెంగుళూరు రోడ్లుపై ఓ యువకుడు స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అందులో వింతేం ఉంది.. అనుకుంటున్నారా…! అయితే ఆ బైకర్ డ్రైవ్ చేస్తూనే తమ తొడలపై ల్యాప్ టాప్ పెట్టుకుని జూమ్ మీటింగ్ కాల్ కు హాజరయ్యాడు. ఒడిలో ల్యాప్ టాప్ పెట్టి.. డ్రైవింగ్ చేస్తూనే ప్రయాణం చేశాడు. దాన్ని గమనించిన ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోకు బెంగుళూరు బిగినర్స్‌కు కాదు అని క్యాప్సన్ ఇచ్చి ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు.

Also Read: Holi Romance Video: అబ్బాయి బైక్ డ్రైవింగ్.. వెనుక అమ్మాయిల హోలీ రొమాన్స్.. షాక్ ఇచ్చిన పోలీసులు!

ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. దీన్ని చూసిన వారు.. ఆశ్చర్యానికి గురి అవుతూనే.. అంత అర్జెంట్ కాల్ అయితే స్కూటీ పక్కన ఆపి మాట్లాడుకోవచ్చుగా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే బెంగుళూరు ట్రాఫిక్ కష్టాలు అలాంటివి.. కొన్నిసార్లు మాకు ఇలాంటి ఫీట్లు తప్పవని అంటున్నారు. టెక్ ఉద్యోగులతే.. ‘మా సాఫ్ట్‌వేర్ కష్టాలు మీకేం తెలుసు భయ్యా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Big Stories

×