Snake Viral Video: వర్షాకాలం వచ్చిందంటే పాములు హల్చల్ సృష్టిస్తాయి. ఇన్ని రోజులు నిద్రావస్థలో ఉన్న పాములు ఇప్పుడు బయటకు వచ్చి ఇళ్లల్లో సంచరిస్తుంటాయి. మనకు సడెన్ గా పాము కనిపిస్తే భయబ్రాంతులకు గురైపోతుంటాం. పాములు విషపూరితమైన జీవులు కాబట్టి ఎక్కడ హానీ చేస్తాయో అని మనం దూరంగా ఉంటాం. అలాంటి పాములతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అయినప్పటికీ కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. పాములతో సెల్ఫీలు దిగడం, పాము దగ్గర మొబైల్ ఫోన్ పెట్టి ట్యూన్ ప్లే చేయడం ఇలా సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి పామును నాలుకతో తాకుతూ.. ఆటలు ఆడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
🔴 #BREAKING | अमरोहा में 'डेयरिंग' बना जानलेवा! 🐍🚨
➡️गांव के जीतू ने सांप को पकड़कर गले में डाला, जीभ से सांप को टच करते हुए किया "शो"
➡️ अचानक सांप ने जीतू को डस लिया, गंभीर हालत में ICU में भर्ती है जीतू
➡️ ग्रामीणों में मचा हड़कंप, डॉक्टरों ने बताया स्थिति नाजुक#Amroha… pic.twitter.com/Wgm02LGKA3
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) June 14, 2025
వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ లైన్ మెన్‌గా పని చేస్తున్న జీతూకు స్థానికంగా ఓ పాము కనిపించింది. దీంతో ఆ పామును పట్టుకున్నాడు. అయితే పామును పట్టుకున్నోడు అటవీ సమీపంలో వదిలేయక.. దానిని మెడల్ చుట్టుకుని హల్చల్ సృష్టించాడు. తన నాలుకతో తాకుతూ ఆటలు ఆడాడు. చివరకు పాము కాటేసింది. దీంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం లైన్ మెన్ జీతూ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ALSO READ: వర్షాకాలం జాగ్రత్త.. ఈ మొక్కను పెంచుకుంటే పాములు రావు
అయితే.. వీడియో కింద నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. సరదా కోసమని పాములతో ఆడితే.. దూల తీరందా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు క్వార్టర్ వేసి ఉంటాడు.. మందు వేస్తే ఏం చేస్తున్నారో తెలియకుండా పోతుంది.. వినాశకాలే విపరీత బుద్ది అని కామెంట్ చేసుకోచ్చాడు. బుద్ది లేని పనులు అంటే ఇవే.. విష సర్పం అని తెలిసి కూడా ఇలా పాములతో ఆటలు ఆడుతారా అని ఇంకొ నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ నకిలీ మనుషుల మధ్య ఉండడం కంటే పాము కాటుతో చావడమే బెటర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రభుత్వం ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాలి.. ఇతను అసలైన వీరుడు.. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి.. ఫ్యామిలీలో ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఎంపీ సీటు ఇవ్వాలి అని మరొకరు ఛమత్కారంగా కామెంట్ చేశాడు.
ALSO READ: రీల్స్ పిచ్చికి.. గుర్రం గట్టిగా తంతే.. వీడియో వైరల్
ఏదేమైనా విషపూరితమైన పాములతో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి పాములు ఇళ్లు చుట్టూ సంచరించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. వీలైనంత ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. పాములతో సరదా సెల్పీలు దిగడం.. పిచ్చిపనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.