BigTV English

Watch Video: గుర్రం దగ్గర గెంతులా? వెనక్కి తిరిగి మరీ తన్నిందిగా.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు

Watch Video: గుర్రం దగ్గర గెంతులా? వెనక్కి తిరిగి మరీ తన్నిందిగా.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు

Watch Video: సూర్య కిరణాలు, పచ్చని పర్వతాలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ అందమైన ప్రకృతి ఉన్న ప్రాంతం అది. అక్కడకు వెళ్తే ఏదో తెలియని మంచి అనుభూతి కలుగుతోంది. ఇదో ఎక్కడో కాదండి మన పొరుగు దేశం నేపాల్‌లోని కురి గ్రామం. అక్కడ పచ్చని అందమైన దృశ్యాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. అక్కడ ఉన్న జలపాతాలు, పచ్చని కొండలు, సరస్సులు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా కనిపిస్తాయి. ఎత్తైన పర్వతాలు, వాటి చుట్టూ ఉన్న లోయలు ఈ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణ. అలాగే ఆ గ్రామంలో కనిపించే సాంస్కృతిక దృశ్యాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందమైన లోయల్లో ఉన్న సరస్సులు కూడా ప్రకృతి అందాలను రెట్టింపు చేస్తాయి.


?utm_source=ig_embed&ig_rid=41cba106-15ec-452e-a2f6-f1b42cc2a1d2

అయితే, ఆకర్షణీమైన ప్రకృతి ప్రాంతంలో ఓ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేయాలని ముచ్చటపడింది. ఫోన్ ఆన్ చేసి రీల్ చేయడం కూడా ప్రారంభించింది.. అలా ట్యూన్‌కు తగ్గట్టు ఆ ప్రకృతి రమణీయమైన ప్రాంతంలో మూడు, నాలుగు స్టెప్పులు వేస్తూ.. డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసింది. అదే సమయంలో పక్కనే ఓ గుర్రం మేత మేస్తోంది. అయితే రీల్ సాంగ్‌కు ఆ గుర్రానికి కూడా డ్యాన్స్ వేయాలనిపించిందో.. మరీ ఏం అనిపించిందో తెలియదు కానీ.. వెనక్కి తిరిగి అమ్మాయిని జెట్ స్పీడ్‌తో తన్నింది. అంతే ఆ అమ్మాయి నేలపై పడిపోయింది. డ్యాన్సింగ్ గర్ల్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. రెండు, మూడు సెకన్ల పాటు ఏం జరిగిందో అయోమయానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.


ALSO READ: Viral Video : అచ్చం తాజ్‌మహల్ లాంటి ఇల్లు.. చూస్తే మైండ్ బ్లాక్.. వీడియో వైరల్

ఈ వీడియోకు ఇన్ స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షిస్తున్నారు. వేల కొద్ది లైకులు వస్తున్నాయి. ఇన్ స్టాలో ఈ వీడియోను ఈ విధంగా పోస్ట్ చేశారు. నేపాల్‌లోని కురి గ్రామంలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని ఓ గుర్రం తన్నింది.. అనే శీర్షికతో ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కింద నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వీడియో చూడడం ద్వారా వచ్చే నవ్వు ఒక ఎత్తు అయితే.. కామెంట్లను చూస్తే వచ్చే నవ్వు అంతకు డబుల్ గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ALSO READ: Viral Video : ఇండియా అని పిల్లలకు పేరు పెడుతున్న విదేశీయులు.. ఎందుకంటే..

ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు.. ఇంకెప్పుడు ఆ అమ్మాయి గుర్రం దగ్గరకు వెళ్లదని కామెంట్‌లో రాసుకొచ్చాడు. మరొకరు ఎంత కిక్ ఉంది ఈ వీడియోలో అని చమత్కరించాడు. మనుషులే కాదు.. జంతువులు కూడా ఈ రీల్ రాణులతో విసిగిపోయారని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే.. గుర్రం కూడా రీల్స్‌కు డ్యాన్స్ వేస్తూ.. ఆ అమ్మాయిని తన్నిందని కామెంట్ చేశాడు. ఈ కామెంట్లను, ఆ వీడియోను చూస్తుంటే ఓ ఐదు నిమిషాలు నవ్వులే నవ్వులు కదా.. మీరు కూడా మరోసారి వీడియోను చూడండి.. కింద కామెంట్లను కూడా చూడండి.. నవ్వుకోండి..

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×