Nageswra Rao: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు(Nageswara Rao) గారి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటివారని చెబుతారు. ఇలా నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలు చేశారు. ఆయన చివరి క్షణం వరకు సినిమాలలో నటిస్తూ కళామ తల్లికి సేవ చేశారు. ఇక ఈయన చివరిగా తన కుటుంబ సభ్యులతో కలిసి మనం(Manam) అనే సినిమాలో నటించారు. ఇదే నాగేశ్వరరావు గారి ఆఖరి సినిమా అని చెప్పాలి. ఇక ఈ సినిమా అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకం.
ఇకపోతే నాగేశ్వరరావు తన సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలలో క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నటించారు కానీ, నిజజీవితంలో కూడా ఆయన క్యాన్సర్(Cancer) తో బాధపడుతూ మరణించిన విషయం తెలిసిందే. క్యాన్సర్ అని బయటపడిన కొన్ని నెలల వ్యవధిలోనే నాగేశ్వరరావు గారు కాలం చేశారు. అయితే తాజాగా నాగేశ్వరరావు కుమార్తె నాగ సుశీల (Naga susheela)ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన తండ్రి చివరి క్షణాల గురించి తెలియజేశారు. నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ అనే విషయం తెలియడంతో ఆయన చేసిన కొన్ని పనుల గురించి నాగ సుశీల ఈ సందర్భంగా బయటపెట్టారు.
క్యాన్సర్ అని డిసైడ్ అయ్యారు..
నాన్నగారికి కాస్త ఆరోగ్యం కుదుటన లేకపోవడంతో తనని కేర్ హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్ కి సిటీ స్కాన్ కోసం తీసుకెళ్లాము. అయితే అంబులెన్స్ వాళ్ళు తనని బసవతారకం హాస్పిటల్ తీసుకెళ్లమని చెప్పారు. వాళ్ళలా చెప్పడంతో నాన్న సరదాగా మాట్లాడుతూ నాకు క్యాన్సర్ ఉందని వీళ్ళు డిసైడ్ అయిపోయి అక్కడికి తీసుకెళ్లారని సరదాగా మాట్లాడారు. మాకైతే ఒకవైపు భయం ఉంది . నాన్న మాత్రం జోకులు వేసుకుంటూ బసవతారకం హాస్పిటల్ వద్దకు వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయించడంతో నిజంగానే క్యాన్సర్ అని బయటపడిందని సుశీల తెలిపారు.
అందరికీ గిఫ్ట్ లు ఇచ్చారు..
ఇలా నాన్నగారికి క్యాన్సర్ అనే విషయం తెలిసిన వెంటనే కిమ్స్ లో సర్జరీ చేయించాము. నాన్నకు క్యాన్సర్ అనే విషయం తెలియడంతో మాకు కూడా కెరియర్ పరంగా కొన్ని సలహాలు సూచనలు చేశారు. ఎప్పుడు కూడా మొదటి స్థానంలో లేమని ఎవరు బాధపడొద్దని మొదటి స్థానంలో లేకపోతేనే మనం జీవితంలో ఇంకా ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుందని అందరికీ ఎన్నో గొప్ప విషయాలు చెప్పేవారు. ఇక నాన్న ఎవరి రుణం ఉంచుకోరు అందుకే నాన్నను బాగా చూసుకున్న డాక్టర్లు, ఆ టీం అందరికీ కూడా పిలిచి వారందరికీ గిఫ్టులు ఇచ్చారని సుశీల తెలిపారు. అయితే క్యాన్సర్ అని తెలియగానే నాన్న ఎక్కువ కాలం బ్రతకలేదని అక్టోబర్ లో ఈ విషయం తెలిస్తే నవంబర్లోనే నాన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అందరికీ తెలిపారు. ఇక జనవరిలోనే నాన్న చనిపోయారని ఈ సందర్భంగా నాగ సుశీలన గుర్తు చేసుకున్నారు.