BigTV English

Fact Check: కొండ మీద ఏనుగు, అమెరికా పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. ఇదీ అసలు సంగతి!

Fact Check: కొండ మీద ఏనుగు, అమెరికా పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. ఇదీ అసలు సంగతి!

Fact Check news: కంటికి కనిపించేవి అన్నీ నిజం కాదు అంటుంటారు పెద్దలు. కొన్ని విషయాల్లో నిజమే అనిపిస్తుంది. ఏఐ టెక్నాలజీ వచ్చాక నిజం లేదో? అబద్దం ఏదో? తెలియక జనాలు సతమతం అవుతున్నారు. టెక్నాలజీ ద్వారా ఎంత లాభం ఉందో, అంతకంటే ఎక్కువ నష్టం ఉందని ఎప్పటికప్పుడు తేలిపోతూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరలైన వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోవడంతో పాటు షాక్‌కు గురయ్యారు. అంతకీ అసలు విషయం ఏంటంటే?


దట్టమైడ అడవిలో ఏనుగు కోసం రెస్క్యూ ఆపరేషన్

ఓ పెద్ద కారడవిలో ఎత్తైన కొండ మీద ఓ ఏనుగు చిక్కుకుపోయింది. ఏమాత్రం అటు ఇటు అయినా కొండ మీది నుంచి ఏనుగు లోయలో పడి చనిపోతుంది. కానీ, పోలీసులు ఆ ఏనుగును రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. పెద్ద క్రేన్ సాయంతో ఏనుగు చుట్టూ తాడుతో కట్టి, అమాంతం లేపుకొచ్చి బయట పెట్టారు. ఏనుగుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షించారు. ఈ వీడియోను ‘యుఎస్ పోలీసులు పర్వతంలో చిక్కుకున్న ఏనుగును రక్షించారు” అంటూ నెట్టింట షేర్  చేశారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. అంత పెద్ద ఏనుగును ఎంత చక్కగా కాపాడారో.. పోలీసులకు హ్యాట్సాప్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.


ఏనుగు రెస్క్యూ ఆపరేషన్ వెనుక అసలు కథ

ఈ వీడియోను అక్టోబర్ 2న AThing Inside అనే యూట్యూబ్ ఛానెల్‌ లో అప్‌ లోడ్ చేశారు.ఈ వీడియో కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ అందుకుంది. అయితే, వీడియో డిస్క్రిప్షన్ లో కంటెంట్ క్రియేటర్స్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియో మార్ప్ చేయబడినది లేదంటే సింథటిక్ కంటెంట్ అని వివరించారు. అంటే, ఏనుగు రెస్క్యూ అపరేషన్ అనేది ఉత్త ముచ్చట. కేవలం దానిని ఏఐ టూల్స్ ఉపయోగించి ఎడిట్ చేశారు. సదరు యూట్యూబ్ చానెల్ లో అన్ని ఇలాంటి వీడియోలే ఉన్నాయి.

మొసలి పైన సింహం నిలబడి ఉండటం, పెద్ద కొండచిలువను తింటున్న పాండా లాంటి విజువల్స్ ను షేర్ చేశారు. అంతేకాదు, ఈ యూట్యూబ్ చానెల్ డిస్క్రిప్షన్ లో “డ్రై వీడియోలను ఫన్నీ వీడియోలుగా మార్చుతాం” అని వెల్లడించారు. అంటే, ఏనుగు రెస్క్యూ అపరేషన్ వీడియోను కూడా జాగ్రత్తగా ఎడిట్ చేశారు. అడవితో ఎలాంటి సంబంధం లేని ఏనుగు, ఎక్కడో పని చేసే క్రేన్ ను ఏఐ టూల్స్ సాయంతో సరికొత్తగా క్రియేట్ చేశారు. ఈ వీడియో బ్యాగ్రౌండ్ ను జాగ్రత్తగా పరిశీలించి చూసినా ఇదే విషయం అర్థం అవుతుంది. టెక్నాలజీ మాయలు తెలియని జనం నిజమే అని నమ్ముతున్నారు. చానెల్ నిర్వాహకులు ఏఐ వీడియోను నిజమైన వీడియోగా నమ్మిస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Read Also: ‘బతుకు బండి‘ మీదే ప్రాణాలు విడిచి.. కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో!

Read Also: జాబ్ కోసం అప్లై చేసిన 48 ఏళ్లకు ఆఫర్ లెటర్, దురదృష్టం లాంటి అదృష్టం అంటే ఇదేనేమో?

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×