Punch Monkey: పుట్టగానే తల్లి వదిలేసింది.. ఇతర కోతులూ దగ్గరకు రానివ్వలేదు. భయపెట్టాయి..గెంటేశాయి..దాడులు చేశాయి. అసలు నువ్వు మా సమూహానికే చెందిన వాడివి కావంటూ వెలివేశాయి. దీంతో ఒంటరిదైపోయింది ఆ చిన్న కోతి.
తల్లి లేదు.. చుట్టూ ఇంత మంది ఉన్నా ఏకాకిగానే మిగిలిన ఆ చిన్న కోతికి.. ఆ బొమ్మే తల్లైంది. ఇతర కోతులు దానిపై పడి కరిస్తే ఆ బొమ్మే దిక్కయ్యింది. ఎవరైనా తరిమితే.. ఆ బొమ్మను పట్టుకునే బాధపడింది. ఎవరైనా భయపడితే.. ఆ బొమ్మ వెనకాలే దాక్కుంది. కష్టమైనా ఆ బొమ్మకే చెప్పుకుంది.. బాధొచ్చినా ఆ బొమ్మను పట్టుకునే ఏడ్చింది..
ఆ బొమ్మే.. ఆ చిన్న కోతికి ప్రపంచంగా మారింది.
ఈ చిన్న కోతిపిల్ల పేరు పంచ్.. జపాన్‌లోని ఇచికావా జూలో గతేడాది జులైలో పుట్టింది. ఏం జరిగిందో తెలియదు.. ఎందుకో అర్థం కాలేదు.. కానీ పంచ్‌ను దూరం పెట్టేసింది తల్లి. జంతు ప్రపంచంలో బిడ్డను తల్లి దూరం పెట్టింది అంటే.. దాని రిజల్ట్ మరణమే.. కానీ దాని అదృష్టం జూ కీపర్ చేరదీశారు.. తల్లి లేని లోటు తెలియకూడదని చెప్పి ఓ బొమ్మను తీసుకొచ్చి ఇచ్చారు. అప్పటి నుంచి ఆ బొమ్మలోనే తన తల్లిని చూసుకుంది పంచ్. ఓ రకంగా చెప్పాలంటే ఆ బొమ్మతో ఓ ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇలాగైతే ఎప్పటికైనా ప్రమాదమని భావించిన జూ కీపర్స్.. దానిని ఇతర కోతులు ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి తెచ్చి వదిలారు. అక్కడ దాని బాధను ఓ సారి చూడండి..
అన్ని కోతులు అక్కడ ఉన్నా దానిది ఒంటరి జీవితమే. జూకీపర్ల కాళ్లను ఎలా వదలకుండా పట్టుకుందో చూడండి. నేనిక్కడ ఉండలేను.. నన్ను నా బొమ్మను ఇక్కడి నుంచి తీసుకెళ్లండని చెబుతుందేమో. కానీ కష్టమైనా అది అక్కడే పెరగాలనేది వారి ఆలోచన. కానీ అక్కడున్న కోతులు మాత్రం దానిని ఆదరించలేదు.. అక్కున అస్సలే చేర్చుకోలేదు..
చూశారుగా.. ఇతర కోతులు తరిమాయి.. దాడి చేశాయి.. భయంతో పరుగులు పెట్టింది పంచ్. కానీ ఆ బొమ్మను మాత్రం వదల్లేదు. తన బొమ్మకు ఏమైనా అవుతుందేమో అన్న భయం కావొచ్చు. ఓ రాయి వెనక్కి వెళ్లి ఎలా దాక్కుందో చూశారుగా. చుట్టూ చాలా కోతులు ఉన్నా.. పంచ్ లోకం మాత్రం ఆ బొమ్మే. ఆట ఆ బొమ్మతోనే.. కోపం ఆ బొమ్మపైనే..
ఇలా అన్ని కోతుల మధ్య పంచ్ ఇప్పుడిప్పుడే ఇతర కోతులతో కాస్త కలుస్తుంది.. అప్పుడప్పుడు ఆడుతుంది. కానీ ఆ బొమ్మను మాత్రం ఎవ్వరూ టచ్ చేయడానికి వీల్లేదు. ఆట ఆటే కానీ నా బొమ్మ జోలికి మాత్రం రావొద్దు అంటూ మర్యాదగా చెబుతోంది పంచ్.
ఎలాగైనా పంచ్‌ను కోతులమందలో కలపాలని విశ్వప్రయత్నం చేస్తున్న జూ కీపర్ల ప్రయత్నం ఇప్పుడిప్పుడే కాస్త వర్కౌట్ అవుతున్నట్టు మాత్రం కనిపిస్తోంది. కొన్ని కోతులు దగ్గరకు రానిస్తున్నాయట. ఏదేమైనా పంచ్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్.. చాలా మంది పంచ్‌కు కనెక్ట్ అవుతున్నారు. వారి జీవితాల్లో లోటుని పంచ్‌లో చూసుకుంటున్నారు.. అందుకే పంచ్ మంకీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది.. ఓ బొమ్మ.. దాని జీవితాన్ని మార్చేసింది.. సొంత వారు వద్దనుకున్నప్పుడు కాస్త ఓదార్పు చూపించిన ఆ ప్రాణంలేని బొమ్మపై.. పంచ్ మంకీ చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతున్నారు.. జంతువులైనా.. మనుషులైనా.. సరైన సమయంలో సరైన తోడు లేకపోతే.. లైఫ్ ఎటు టర్న్ తీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు.
టెడ్డీ బేర్నే అమ్మ ఒడిగా మార్చుకున్న బుజ్జి కోతి!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కోతి పిల్ల వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. మంద నుండి వేరై ఒంటరిగా మారిన ఆ బుజ్జి కోతి, ఒక టెడ్డీ బేర్ బొమ్మను తన తల్లిగా భావిస్తూ గట్టిగా హత్తుకుంది. మూగజీవుల మాతృత్వ వేదనను చాటిచెబుతున్న ఈ… pic.twitter.com/qrWPDN6fOk
— ChotaNews App (@ChotaNewsApp) February 20, 2026