E-Paper
Advertisement

ECIL Recruitment: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే కొలువు.. హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాల జాతర

ECIL Recruitment: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే కొలువు.. హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాల జాతర
Advertisement

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించింది. కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది.

విద్యార్హతలు..

Advertisement

దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో కనీస పని అనుభవం ఉంటే ఇంకా మంచిది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రాజెక్ట్ నిర్వహణలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు వివరాలు..

Advertisement

అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయస్సులో రాయితీ ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాలను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుండి రూ. 31,000 వరకు వేతనం అందుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే తుది ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం..

అభ్యర్థుల అకడమిక్ రికార్డులు, పని అనుభవం కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

ఇంటర్వ్యూ వివరాలు..

ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు తదితర సర్టిఫికెట్స్ ఉంటే సరిపోతుంది.

ఇంటర్వ్యూ వేదిక..

కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్ (CLDC), నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్, హైదరాబాద్ – 500062.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.ecil.co.in/

కీలక సమాచారం:

ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 24

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారానే..

జీతం: రూ.31,000

ALSO READ: Best Jobs: ఇక ఇంజనీరింగ్ చదవడం వేస్ట్, ఇకపై ఈ ఉద్యోగాలకే భారీ జీతాలు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×