E-Paper
Advertisement

Volkswagen Tayron R-Line: దేశీ మార్కెట్ లోకి అడుగు పెట్టిన వోక్స్‌ వ్యాగన్ టేరాన్ R-లైన్‌, ధర ఎంతో తెలుసా?

Volkswagen Tayron R-Line: దేశీ మార్కెట్ లోకి అడుగు పెట్టిన వోక్స్‌ వ్యాగన్ టేరాన్ R-లైన్‌, ధర ఎంతో తెలుసా?
Advertisement

ప్రముఖ ఆటో మోబైల్ దిగ్గజం వోక్స్‌ వ్యాగన్ సరికొత్త కారును మార్కెట్ లోకి లాంచ్ చేసింది. టేరాన్ R-లైన్‌ SUVని  భారతీయ మార్కెట్ కు పరిచయం చేసింది. రూ.46.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అదనపు వరుస సీట్లతో పెద్ద SUV అయినప్పటికీ, టేరాన్ 5 సీట్ల టిగువాన్ కంటే కేవలం రూ. 1.26 లక్షలు ఎక్కువ ధరను కలిగి ఉంది.

వోక్స్‌ వ్యాగన్ టేరాన్ R-లైన్ పవర్‌ ట్రెయిన్

స్కోడా కోడియాక్, VW టిగువాన్ R-లైన్ మాదిరిగానే అదే ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.  2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో పవర్ ను పొందుతుంది. ఇది 204hp పవర్, 320Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ (DCT)కి జతచేయబడి అన్ని చక్రాలకు (AWD) పవర్ ను అందిస్తుంది. అదే ఇంజిన్ 5 సీటర్ టిగువాన్ R-లైన్, స్కోడా కోడియాక్‌ లలోనూ అందిస్తుంది. టేరాన్ R-లైన్ 224kph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. 7.3 సెకన్లలో 0-100kph స్పీడ్ ను అందుకుంటుంది.

వోక్స్‌ వ్యాగన్ టేరాన్ R-లైన్ డిజైన్

Advertisement

వోక్స్‌ వ్యాగన్ టేరాన్ R-లైన్ 5-సీట్ల టిగువాన్‌ మాదిరిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా దాని బాక్సీ పర్సంటేజ్, అగ్రెసివ్ లుక్ తో  కొన్ని డిజైన్ తేడాలు కనిపిస్తాయి. టేరాన్ R-లైన్‌లో మ్యాట్రిక్స్ LED హెడ్‌ లైట్లు, LED టెయిల్ లైట్ ఎలిమెంట్స్ కూడా సర్దుబాటు చేయబడ్డాయి. ముందు, వెనుక భాగంలో వోక్స్‌ వ్యాగన్ లోగోలు ఉన్నాయి. అయితే, టేరాన్ R-లైన్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్‌ లపై గ్లోస్ బ్లాక్ క్లాడింగ్, R లైన్ బ్యాడ్జ్‌ లు టిగువాన్ R-లైన్‌ మాదిరిగానే ఉంటాయి. రెండు మోడళ్లు ఒకే MQB EVO ప్లాట్‌ ఫామ్‌ మీద నిర్మించబడినప్పటికీ, 3 వరుసల టేరాన్ R-లైన్ 109mm పొడవైన వీల్‌ బేస్‌ను కలిగి ఉంది.

వోక్స్‌ వ్యాగన్ టేరాన్ R-లైన్ ఇంటీరియర్, ఫీచర్లు   

టేరాన్ R-లైన్ ఇంటీరియర్ టిగువాన్ R-లైన్‌ మాదిరిగానే కనిపిస్తుంది. 15-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 3-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో సహా మిగతావన్నీ ఒకేలా ఉన్నాయి. సీట్లు లెథరెట్ అప్హోల్స్టరీతో ఉంటాయి. అడ్జెస్టబుల్ హెడ్‌ రెస్ట్‌ లు ఉంటాయి.

Advertisement

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, మెమరీ, మసాజ్, వెంటిలేషన్ ఫంక్షన్‌లతో 12 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 11 స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌ గేట్, 30 కలర్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. సేఫ్టీ సూట్‌లో 9 ఎయిర్‌ బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీల కెమెరా, లెవల్ 2 ADAS, హిల్ స్టార్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్‌ లు ఉన్నాయి. వోక్స్‌ వ్యాగన్ టేరాన్ R-లైన్ దేశీ మార్కెట్ లో స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్, MG మెజెస్టర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: టయోటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV, ఇండియాలో అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×