BigTV English

Tirumala Gold Devotees: ఇదేం భక్తి.. తిరుమలకు 25 కేజీల బంగారు నగలు ధరించి వచ్చిన ఫ్యాషన్ భక్తులు..

Tirumala Gold Devotees: ఇదేం భక్తి.. తిరుమలకు 25 కేజీల బంగారు నగలు ధరించి వచ్చిన ఫ్యాషన్ భక్తులు..

Tirumala Gold Devotees: లోకంలో ఎంత ఆడంబరంగా జీవించినా.. దేవుని సన్నిధిలో వెళితే మాత్రం ఆడంబరాలకు దూరంగా ఉండాలి. కానీ ఒక కుటుంబం దైవ సన్నిథిలో కూడా ఫ్యాషన్ ఫోజులిస్తూ దర్శనానికి వచ్చింది. సెక్యూరిటీగా ఇద్దరు బాడీగార్డులు, ఒంటినిండా భారీ బరువుగల బంగారు నగలు, కళ్లకు సన్ గ్లాసులు ఇవన్నీ వేసుకొని బాహాటంగా తమ సంపద ప్రదర్శన చేస్తూ తిరుమల దర్శనానికి వచ్చారు. వీరి భక్తి చూసి సోషల్ మీడియాలో నెటిజెన్లు చివాట్లు పెడుతున్నారు.


వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఫ్యాషన్ భక్తుల వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పుణెకి చెందిన ఒక సంపన్న కుటుంబం తిరుమల శ్రీ వెంటశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చింది. వీడియోలో కనబడుతున్నట్లు కుటుంబంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్న పిల్లాడు ఉన్నారు.

Also Read:  610 కేజీల బరువుతో చనిపోతాడనుకున్న బాలుడు బతికాడు.. అంతా ‘రాజు’గారి దయ..


అయితే వారితో పాటు వారికి సెక్యూరిటీగా ఇద్దరు గన్ మెన్‌లు సఫారీ సూట్ లో ఉన్నారు. ఇంత వరకు సరే. కానీ.. వారి వేషాధారణే అసలు సమస్య. వారి వేసుకున్న బట్టలు, ఒంటి నిండా భారీ బరువుగల బంగారు నగలు.. పైగా కళ్లకు ఖరీదైన సన్ గ్లాస్ అద్దాలు. అబ్బబ్బా.. వారిని చూస్తేనే తెలుస్తోంది.. వారు అక్కడ దేవుని పూజ కోసం రాలేదు. తమ వద్ద ఉన్న సంపదను ప్రదర్శించడానికి వచ్చారని.

వీడియోలో తెలిపినట్లు ఆ కుటుంబం ధరించిన బంగారం దాదాపు 25 కిలోలు ఉంటుంది. కుటుంబంలోని ఇద్దరు పురుషులు పంచెకట్టుతో, బనియన్లు వేసుకొని ఉన్నారు. మెడలో బాగా లావుగా ఉన్న బంగారు చైన్లు వేసుకొని, కళ్లకు బాగా స్టైల్ గా సన్ గ్లాస్ అద్దాలు, అవి కూడా బంగారంతో అలంకరించి ఉన్నాయి. పైగా వారితో వచ్చిన మహిళ కూడా ఒంటి నిండా బంగారు నగలు, ఖరీదైన వస్త్రాలు ధరించి ఉంది. ఆ కుటుంబం వేసుకున్న బంగారం విలువ కనీసం రూ.18 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు వీడియోకు 1.4 లక్షల వ్యూస్ వచ్చాయి. 400 లైకులున్నాయి. అయితే ఈ వీడియో చూసిన నెటిజెన్లు వారిని బాగా విమర్శిస్తున్నారు. ఎక్స్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై చాలా మంది కామెంట్లు చేశారు. ఒక ఎక్స్ యూజర్.. ”మిమ్మల్ని ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్లు గమనిస్తున్నారు.. జాగ్రత్త” అని రాశాడు. మరొక యూజర్ అయితే.. ”భగవంతుని ముందు షో ఆఫ్ ఎందుకు” అని కామెంట్ చేశాడు. ఇంకొకరైతే.. ”ఇది పిచ్చికి పరాకాష్ట” అని మండిపడ్డాడు.

 

ఆంధ్ర ప్రదేశ్ తిరిపతి జిల్లా లో ఉన్న తిరుమల దేవాలయానికి ప్రతి రోజు 75000 నుంచి 90000 మంది భక్తులు ఆ భగవాన్ బాలాజీ దర్శనానికి వస్తూ ఉంటారు. గత జూలై నెలలో 22 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారు. నెల రోజుల్లో తిరుమల దేవస్థానం వారు కోటి లడ్డూలు విక్రయించారు. జూలై తిరుమల హుండీ ఆదాయం రూ.125 కోట్లు అని తిరుమల తిరపతి దేవస్థానం అధికారి శ్యామల రావు తెలిపారు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

 

 

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×