Indian Railways: భారతీయ రైల్వే సంస్థ.. దేశ వ్యాప్తంగా నిత్యం సుమారు 20 వేల రైళ్లను నడిపిస్తున్నది. వాటిలో సుమారు 13 వేల ప్యాసింజర్ రైళ్లు కాగా, మిగతావి గూడ్స్ రైళ్లు. ఇంత పెద్ద సంఖ్యలో రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రైల్వేశాఖ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా ‘కవచ్’ లాంటి వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అత్యాధునిక దేశీ టెక్నాలజీ రైలు ప్రమాదాలను గణీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇక తాజాగా రైలు పట్టాలపై డిటోనేటర్లు పెట్టే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. చాలా మంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. సదరు వ్యక్తులపై కేసు పెట్టాలని కామెంట్స్ చేశారు.
పట్టాల మీద డిటోనేటర్లు ఎందుకు పెట్టారంటే?
రైల్వే ట్రాకుల మీద ఇనుప కడ్డీలు ఉంచడం, రైలు పట్టాలు తప్పేలా చేయడం సహా పలు దుశర్చర్యలకు పాల్పడుతున్నారు దుండగులు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాలకు కారణమయ్యే ఎలాంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే, రైలు పట్టాలపై డిటోనేటర్లు పెడుతున్న వీడియో వైరల్ అయ్యింది. రైల్వే సిబ్బందే ఇలా డిటోనేటర్లను రైలు పట్టాలపై అంటించడాన్ని చూసి షాక్ అయ్యారు. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ వీడియోలో ఏం ఉందంటే?
యువ రైల్వే సిబ్బంది అంతా కలిసి పదుల సంఖ్యలో డిటోనేటర్లు రైలు పట్టాల మీద అమర్చారు. కాసేపటి తర్వాత రైలు అటుగా వచ్చింది. డిటోనేటర్ల మీదుగా ముందుకు వెళ్లింది. రైలు వెళ్తుండగా ఒక్కో డిటోనేటర్ పేలడం మొదలుపెట్టింది. గట్టిగా శబ్దం చేస్తూ అన్ని బ్లాస్ట్ అయ్యాయి. రైల్వే సిబ్బంది అంతా ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. నిజానికి ఈ వీడియో చూసి చాలా మంది తప్పుగా భావించారు. కానీ, అది రైల్వే ప్రమాదాలను నివారించేందుకు అనుసరించే వ్యూహం. పొగమంచు దట్టంగా ఉన్న సమయంలో లేదంటే ఇతర ఇబ్బందికర పరిస్థితులు ముందుగా ఉన్న సమయంలో వీటిని రైలు పట్టాల మీద అమర్చుతారు. రైలు వాటి మీది నుంచి వెళ్లగానే పెద్ద శబ్దంతో పేలపోతాయి. వెంటనే లోకో పైలెట్ అలర్ట్ అవుతాడు. రైలు వేగాన్ని తగ్గిస్తాడు. ముందు ఏదో ప్రమాదకర పరిస్థితి ఉందని తెలుసుకుంటాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఈ వీడియో చూసి ప్రమాదకరమైన చర్య అంటుండగా, మరికొంత మంది ఈ ఆలోచన చాలా బాగుంది అంటున్నారు. ఇలాంటి పనులు నిపుణుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటుందని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. రైల్వే భద్రత విషయంలో ఇలాంటి చర్యలు తప్పకుండా అవసరం అని ఇంకొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షల వ్యూస్ సాధించింది. వేల కామెంట్స్ అందుకుంది. మొదట కంగారు పడ్డా, ఆ తర్వాత అసలు విషయం తెలిసి సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
Read Also: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. ఈ మార్గంలో 30 రైళ్లు క్యాన్సిల్, కారణం ఏంటంటే?