IND VS ENG 2ND ODI: టీమ్ ఇండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ నెగ్గిన టీమిండియా.. రెండో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే… మొన్న కటక్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కటక్ లోని ( Cuttak ) బారాబతి స్టేడియంలో… రెండవ వన్డే మ్యాచ్ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Also Read: SA20 Final: సన్ రైజర్స్ కు షాక్…SA20 టోర్నీ విజేతగా MI కేప్‌టౌన్
మధ్యాహ్నం ఒకటి గంటలకు… టాస్ ప్రక్రియ జరుగుతుంది. ఈ మేరకు.. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ను .. హాట్ స్టార్ లో లైవ్ చూడవచ్చు. లేదా స్టార్ స్పోర్ట్స్ లో కూడా మనం చూడవచ్చు. అయితే… కటక్ పిచ్ ప్రకారం… మొదట టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట బౌలింగ్ చేసిన జట్టు గెలిచే అవకాశాలు ఉన్నట్లు క్రీడా విశేషములు చెబుతున్నారు.
ఇక ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా మాజీ విరాట్ కోహ్లీ రంగంలోకి దిగబోతున్నాడు. మోకాలి గాయం కారణంగా మొదటి వన్డే కు దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. అయితే… ఆ గాయం తగ్గిన నేపథ్యంలో రెండో వన్డే కు విరాట్ కోహ్లీ రెడీ అయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ ( Virat Kohli ) జట్టులోకి వస్తే… ఎవరో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. వాస్తవంగా మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. జట్టులోకి రాగానే బాగానే రానించి 50 కి పైగా పరుగులు చేశాడు అయ్యారు.
అంటే ఈ లెక్కన శ్రేయస్ అయ్యర్ ను జట్టులోంచి తీసే అవకాశాలు లేవు. కాబట్టి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ పైన భారం పడే ఛాన్సులు ఉన్నాయి. అతని తప్పించి విరాట్ కోహ్లీకి ( Virat Kohli ) స్థానం ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్ ఇద్దరిలో ఎవరో ఒకరిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే హర్షిత్ రానా లేదా అర్షదీప్ సింగ్… ఇద్దరిలో ఎవరో ఒకరు ఈసారి మ్యాచ్ ఆడబోతున్నారు.
Also Read: Rachin Ravindra: రచిన్ రవీంద్రకు తీవ్ర గాయం…ఆస్పత్రికి తరలింపు!
టీమిండియా XI: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్/శ్రేయస్ అయ్యర్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా/అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ
ఇంగ్లాండ్ XI: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (సి), జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్/మార్క్ వుడ్