Viral Video: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది ఫేక్ వీడియో తెలియక చాలామంది తికమక పడుతున్నారు. టెక్నాలజీ అనేది అంతగా సామాన్యుడికి చేరువైంది. ఒక్కోసారి కొన్ని వీడియోలు చూస్తుంటే అర్థంకాదు. మనం చూస్తున్న వీడియో కూడా అలాంటిదే. కాకపోతే చిన్నడౌట్ వస్తుంది. దానిపై ఓ లుక్కేద్దాం.
ఏప్రిల్ 6న శ్రీలంక నుండి ఇండియాకు వస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామసేతును సందర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఆయన షేర్ చేశారు. ఆ రోజు తమిళనాడులోని రామేశ్వరంలో రామసేతుపై నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. ఆ విషయాన్ని కాసేపు పక్కన బెడదాం.
తాజాగా కొంతమంది స్కూబా డైవర్లు నీటి అడుగున భారీ రాతి నిర్మాణాలను అన్వేషిస్తున్నట్లు చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను షేర్ చేసిన రామసేతు నిర్మించిన నీటి అడుగున ఉన్న ప్రదేశమని రాసుకొచ్చారు. వైరల్ అవుతున్న వీడియోకు రామసేతుకు ఎలాంటి సంబంధం లేదు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI సహాయంతో సరికొత్తగా క్రియేట్ చేసి వదిలారు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినప్పుడు భారతీయ చరిత్ర, మతం, సంస్కృతికి సంబంధించిన అనేక ఏఐ వీడియోలు తెగ హంగామా చేస్తున్నాయి.
ALSO READ: జడ్డి గారే దొంగ.. పోలీసుల తీరుతో న్యాయస్థానం షాక్
కాసింత హిస్టరీలోకి వెళ్తే.. రామ సేతును రకరకాల పేర్లతో పిలుస్తారు. పురాణాల ప్రకారం రామసేతు రామాయణానికి సంబంధించినది మాత్రమే. లంకకు వెళ్లే సమయంలో రాముడు, వానర సైన్యం సాయంతో ఓ వంతెనను నిర్మించారని చెబుతారు. దానికి రామసేతు అని పేరు పెట్టారు. ఈ ప్రాంతం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది.
రామసేతు సమీపంలో ఇప్పటికే తేలియాడే రాళ్లను చూడవచ్చు శాటిలైట్ చిత్రాలు అప్పడప్పుడు విడుదలవుతాయి. ఈ వంతెన మానవులు నిర్మించారా? సహజ సిద్ధంగా ఏర్పడిందా అనే దానిపై ఏళ్ల తరబడి చర్చ లేకపోలేదు.
The Rama Setu: Exploring the Floating Rocks Beneath the Waves 🌊✨
Dive into the depths of legend with us as we explore the Rama Setu bridge—said to be built with floating rocks that defy gravity! 🧜♂️💎#MythologyMeetsReality #RamaSetu #UnderwaterWonders
जय श्री राम 🙏🚩 pic.twitter.com/JDrUbpPSKL
— परी आरू ❣️ (@pari_aruu01) April 8, 2025