Big Tv Live Originals: రాజ్యాన్ని పాలించే రాజు అంటే ఎలా ఉంటాడు..? ఎవరక్కడ.. అంటే చాలు ఆజ్ఞ మహారాజా అంటూ భటులు పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు. అసలు రాజు ఆజ్ఞాపించకుంటే.. కాదు కాదు ఆజ్ఞాపించలేకుంటే ఎలా ఉంటుంది. ఆజ్ఞాపించకుంటే, రాజ్యాన్ని పాలించడం సాధ్యమా..? ఆజ్ఞాపించాలంటే మాటలు రావాలి. మరి రాయి రాజయితే రాజ్యం, రాజ్యపాలన ఎలా జరుగుతుంది..? ఓ దీవిలో రాయే రాజు మరి. రాజ్య పరిపాలన కూడా అదే చూసుకుంటుంది. ఈ వింత ఆచారాం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫిలిప్పీన్స్‌లోని సెబూ ద్వీపంలో ఒక రాయి రాజుగా ఉందట. ఈ రాజ హోదాను ‘డాటు’ అని పిలుస్తారు. ఈ రాయి లాపులాపు అనే యోధుడి వీరత్వానికి గుర్తుగా మిగిలిపోయిందట. ఆయన 1521లో స్పానిష్ నావికుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్‌ను ఓడించి చరిత్రలో నిలిచాడు. అక్కడ ఉండే ప్రజలంతా ఈ రాయిని ఆయన ప్రతిరూపంగా చూసుకుంటారట.
ద్వీపంలో లాపులాపు మాక్టాన్ ఒక లీడర్, స్పానిష్ సామ్రాజ్యవాదులతో పోరాటం చేశాడు. మాగెల్లాన్ ఫిలిప్పీన్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, లాపులాపు తన యోధులతో కలిసి పోరాడాట. ఆ సమయంలోనే మాగెల్లాన్‌ను చంపేశాడు. ఈ సంఘటన జరిగిన ప్లేస్‌లో ఒక రాయిని లాపులాపు స్మారకంగా స్థాపించాడు. తర్వాత ఆ రాయి ఉన్న స్థలంలో ప్రజలు లాపులాపు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుండి స్థానికులు దీనికి రాజ హోదా ఇచ్చి గౌరవిస్తారు.
ALSO READ: సమ్మర్‌లో కూల్ ప్లేసెస్‌లో ఎంజాయ్ చేయండి
అయితే, ఈ రాయి చుట్టూ ఉండే స్థలం ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా మారింది. ప్రతి యేటా లాపులాపు వీరత్వానికి గుర్తుగా అక్కడ ఉండే వారంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రాయి దగ్గర పూజలు, కచేరీలు, ప్రదర్శనలు కూడా జరుగుతాయి. కొత్తతరానికి చరిత్ర తెలిసేలా చేయడానికి కూడా ఈ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతారు.
ఒక రాయికి రాజ హోదా ఇవ్వడం అనేది కొంచం వింతగానే అనిపిస్తుంది. ఇది ఫిలిప్పీన్స్ ప్రజలకు కేవలం ఒక రాయి కాదు, వారి స్వాతంత్య్ర ఆకాంక్షలకు, స్ఫూర్తికి చిహ్నం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ వింత సంప్రదాయాన్ని చూసి ఆశ్చర్యపోతారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.