BigTV English

Rental Girlfriend: అద్దెకు గర్ల్ ఫ్రెండ్, అక్కడ ఇదో నయా ట్రెండ్!

Rental Girlfriend: అద్దెకు గర్ల్ ఫ్రెండ్, అక్కడ ఇదో నయా ట్రెండ్!

Girlfriend For Rent: చాలా మందికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తారు. కానీ, చీటికి మాటికి అలగడం బాయ్ ఫ్రెండ్స్ కు నచ్చదు. కొన్నిసార్లు మరీ ఇబ్బంది పెట్టడం కోపం తెప్పిస్తుంది. అందుకే, జపాన్ లో ఈ తిప్పలు లేకుండా నయా ట్రెండ్ అందుబాటులో ఉంది. అదే రెంటెల్ గర్ల్ ఫ్రెండ్ విధానం. అంటే, అద్దెకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది అన్నమాట. ఈ గర్ల్ ఫ్రెండ్ లైంగిక సంబంధం పెట్టుకోవడం తప్ప మినహా మిగతా అన్ని రకాలుగా గర్ల్ ఫ్రెండ్ మాదిరిగానే ఉంటారు. ముఖ్యంగా టోక్యో, ఒసాకా, క్యోటో  లాంటి పెద్ద నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.


⦿ ఇంకీ ఏంటీ అద్దెకు గర్ల్ ఫ్రెండ్ సర్వీస్?

రెంటెల్ గర్ల్ ఫ్రెండ్ సేవ అనేది ఓ వ్యక్తితో తాత్కాలికంగా గడిపేందుకు రూపొందించబడింది.  ఇందులో ఒక మహిళ కొన్ని గంటలు లేదంటే ఒక రోజంతా గర్ల్‌ ఫ్రెండ్ గా ఉంటుంది. సాధారణంగా డేట్‌కు వెళ్లడం, సినిమా చూడటం, డిన్నర్ చేయడం, లేదంటే కేవలం మాట్లాడుతుంది. ఈ సర్వీసు సాధారణంగా లైంగిక సంబంధాలను కలిగి ఉండవు. ఎక్కువగా భావోద్వేగ సహచర్యంపై దృష్టి సారిస్తాయి.


⦿  రెంటెల్ గర్ల్ ఫ్రెండ్ ధరలు, సేవలు

అద్దె గర్ల్ ఫ్రెండ్ సర్వీసుకు సాధారణంగా ఒక గంటకు 4,000 నుంచి 9,000 యెన్(భారత కరెన్సీలో రూ. 2,500 నుంచి రూ. 6,000) వరకు ఉంటుంది. అయితే,  కనీసం 2 గంటల బుకింగ్ అవసరం. అదనంగా ట్రావెల్ ఖర్చులతో పాటు కొన్ని అదనపు రుసుములు ఉంటాయి. అద్దె గర్ల్ ఫ్రెండ్స్ డిన్నర్ డేట్స్, థీమ్ పార్క్‌లకు వెళ్లడం,  కరోకే సెషన్‌లు, కేవలం సిటీలో స్ట్రోల్ చేయడం వంటివి చేస్తారు. కొన్ని సంస్థలు వివాహాలు, కుటుంబ వేడుకలకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండే సేవలను అందిస్తున్నాయి.

⦿ జపాన్ లో మంచి ఆదరణ

జపాన్‌ లో సాంప్రదాయ సంబంధాలు, వివాహం గురించి సామాజిక ఒత్తిడి చాలా ఎక్కువ. ఒంటరిగా ఉన్నవారు కుటుంబ వేడుకలకు అద్దె గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకెళ్తారు. జపాన్‌లో ఒంటరితనం ఒక సమస్యగా ఉంది. ముఖ్యంగా యువకులు ఈ సేవలను ఎంచుకుంటున్నారు. జపాన్ లో ఈ సేవలు చట్టబద్ధమైనవి. కానీ, కఠినమైన నియమాలతో నడుస్తాయి. లైంగిక సంబంధాలు, శారీరక సంబంధాలు ఉండకూడదు. చేతులు పట్టుకోవడం వరకే పరిమితం చేయబడ్డాయి. క్లయింట్‌లు సంస్థ ద్వారా మాత్రమే సంప్రదించాలి.  వ్యక్తిగత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం నిషేధం.

⦿ రెంటెల్ గర్ల్ ఫ్రెండ్ సేవలు ఎలా పొందాలి?

క్లయింట్‌లు సాధారణంగా ఈ సర్వీసులను అందించే సంస్థ వెబ్‌ సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలి. అందుబాటులో ఉన్న అమ్మాయిల ప్రొఫైల్‌ ఎంచుకోవచ్చు. కొన్ని సంస్థలు జూనియర్, రెగ్యులర్,  ప్రీమియం కేటగిరీలను అందిస్తాయి. ఆయా కేటగిరీలను బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

⦿ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ సేవలను ఎంచుకునేటప్పుడు ప్రముఖమైన, చట్టబద్ధమైన సంస్థలను  ఎంచుకోవాలి. నియమ నిబంధనలు కచ్చితంగా ఫాలో కావాలి.  నియమాలను గౌరవించండి మరియు అనుచిత అభ్యర్థనలు చేయకండి.

Read Also: 180 మీటర్లకు బైక్ రైడ్ బుకింగ్, మహిళ చేసిన పనికి అందరూ షాక్!

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×