E-Paper
Advertisement

Women Fighting in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో మళ్లీ లొల్లి.. మహిళలు రచ్చ చేసిన వీడియో వైరల్!

Women Fighting in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో మళ్లీ లొల్లి.. మహిళలు రచ్చ చేసిన వీడియో వైరల్!
Advertisement

2 Women Fighting in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో తరచూ ఏదో ఒక వీడియో తెరపైకి వస్తూనే ఉంటుంది. మెట్రోలో అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యకరమైన దుస్తులు ధరించి మహిళలు ప్రయాణించడం, గొడవలు, కొట్లాటలు, దుర్భాషలాడడం, రీల్స్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం వంటి ఎన్నో ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అధికారులు ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటున్నా కూడా ప్రయాణికులు మాత్రం మారడం లేదు. తాజాగా మరోసారి ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచింది. ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో లేడీస్ కోచ్‌లో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరుగుతున్నట్లు కనిపించింది. అక్కడ కూర్చున్న చాలా మంది ప్రయాణికులు ఈ సంఘటనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తొలుత కాస్త నెమ్మదిగానే మొదలైన గొడవ రానురాను పెరిగిపోయింది. ఒకరిపై ఒకరు గొంతు పెంచుకుని అరుచుకోవడం ప్రారంభించారు. దీంతో అక్కడ ఉన్న చాలా మంది యువతులు పక్కకు జరిగిపోయారు. ఈ తరుణంలో ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో మరోక మహిళ జోక్యం చేసుకుని ఇద్దరిని ఆఫేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తుంది.

Advertisement

మహిళ ఆపేందుకు ప్రయత్నించినా కూడా ఇద్దరు ఆగకుండా ఒకరిపై ఒరకు దాడి చేసుకున్నారు. ఒకరు జుట్టు పట్టుకుని మరొకరు గొంతు పట్టుకుని కొట్టుకున్నారు. దీంతో ఈ వీడియోను తోటి ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు ‘ఢిల్లీ మెట్రోలో ఇవన్నీ కామన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Viral Video: ఒంటెను ఢీకొన్న కారు.. పాపం ఎటూ కదల్లేని పరిస్థితిలో ?

Advertisement

Tags

Related News

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

Big Stories

Advertisement
×