BigTV English

Pastor Case: కారు ఢీకొట్టిందా? సీసీ కెమెరాలో రికార్డ్.. పాస్టర్ మరణంపై ఎస్పీ ఏం చెప్పారంటే?

Pastor Case: కారు ఢీకొట్టిందా? సీసీ కెమెరాలో రికార్డ్.. పాస్టర్ మరణంపై ఎస్పీ ఏం చెప్పారంటే?

Pastor Case: హైదరాబాద్, తిరుమలగిరికి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్(45) నిన్న ఉదయం అనుమానస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ డెడ్ బాడని పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కీలక విషయాలను వెల్లడించారు.


నిన్న ఉదయం రోడ్డు పక్కన ప్రవీణ్ కుమార్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారని ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారని అన్నారు. డెడ్ బాడీ పక్కనే ఉన్న మొబైల్ ను పోలీసులు స్వాధీన పరుచుకున్నారని తెలియజేశారు. ప్రవీణ్ నుంచి చివరి కాల్ రామ్మోహన్ ఆర్‌జేవైకి వెళ్లిందని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే అతనికి కాల్ చేయగా రామ్మోహన్, అతని భార్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని ప్రవీణ్ ది అని వారు క్లారిటీ ఇచ్చారు.

ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లో నివసిస్తారని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోకి వెళ్లి మత బోధికుడిగా సేవలు అందిస్తారని వారు చెప్పారు. ఆ తర్వాత వెంటనే పోలీసులు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ప్రవీణ్ బామ్మరిది మంగళవారం సాయంత్రం వచ్చి అనమానస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


రాత్రి 11:43 గంటలకు రోడ్డు ప్రమాదం..?

సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లైస్ టీమ్ తో కొన్ని ఆధారాలు సేకరించామని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలని నిర్ణయించామని అన్నారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో విచారణ చేయించామని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా వీడియో రికార్డ్ చేశామని పేర్కొన్నారు. కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో ప్రవీణ్ కుమార్ బైక్ పై వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ సేకరించామని తెలిపారు. సోమవారం రాత్రి 11:43 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్టు సీసీ టీవీ ఫుటేజీని బట్టి తెలుస్తోందని చెప్పారు. బైక్ ను కారు ఢీకొన్నట్లు తెలుస్తోందని.. అయితే సీసీ ఫుటేజీలో ప్రమాదం ఎలా జరిగింది అనేది క్లారిటీగా కనిపించడం లేదని ఎస్పీ అన్నారు.

ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి..

తమకు లభ్యమైన ఆధారాలపై లోతుగా విచారణ చేస్తున్నామని చెప్పారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రవీణ్ కుమార్ కేసుకు సంబంధిచి ఎవరి దగ్గరైనా ప్రూఫ్స్ ఉంటే ఇవ్వాలని ఆయన చెప్పుకొచ్చారు. పోస్టు మార్టం నిమిత్తం ఆందోళనకారులను ఒప్పించి డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలించామని ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు.

పాస్టర్ మృతిపై మంత్రి నారా లోకేష్ స్పందన

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘పాస్టర్ ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తాం’ అని మంత్రి తెలిపారు.

ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..

ALSO READ: Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×