BigTV English

Telangana : చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ.. యువకుడి డిమాండ్ తెలిస్తే..

Telangana : చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ.. యువకుడి డిమాండ్ తెలిస్తే..

Telangana : కడుపు కాలిన వాడికే.. ఆ కడుపు మంట తెలుస్తుంది. కష్ట పడిన వాడికే.. ఆ కష్టం విలువ ఎరుకైతది. నష్ట పోయిన వాడికే.. ఆ లాస్ విలువు తెలుసొస్తది. మోస పోయిన వాడికే.. నర నరాన ఆవేశం పొంగుకొస్తది. అలాంటి ఓ బాధితుడు… అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు. తన బాధ అధికారులకు తెలిసొచ్చేలా.. తన జీవితం తలకిందులు కాకుండా ఉండేలా.. వినూత్నంగా నిరసన తెలిపాడు. అతడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్నాళ్లూ పట్టించుకోని ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.


థింక్ డిఫరెంట్.. యాక్ట్ డిఫరెంట్

కాలం మారింది. జనాలు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా సమస్యపై నిరసన తెలపాలంటే.. దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు గట్రా చేసేవారు. కానీ, ఇప్పుడు తమ సమస్యల సెగ గట్టిగా తగిలేలా.. వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. రోడ్లు బాగా లేకుంటే, గుంతలు పడితే.. అధికారులకు మెమోరాండం లాంటివి ఇచ్చే రోజులు కావివి. ఆ రోడ్డు గుంతల్లోనే మొక్కలు నాటుతున్నారు.. వరి నాళ్లు వేస్తున్నారు.. బతుకమ్మ ఆడుతున్నారు.. ఇలా రకరకాల రీతుల్లో తమ డిమాండ్లు నెరవేర్చుకుంటున్నారు. ఇటీవల ఓ యువకుడు తన పని చేయట్లేదని ప్రభుత్వ కార్యాలయంలో పామును వదిలాడు. ఇంకోచోట గవర్నమెంట్ ఆఫీసు గదికి తాళం వేశారు. కొందరైతే పెట్రోల్ క్యాన్, విషం డబ్బా లాంటివి తీసుకొచ్చి సూసైడ్ చేసుకుంటామంటూ బెదిరిస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ల వాళ్ల స్టైల్‌లో ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు.


చెట్టుకు తలకిందులుగా వేలాడి.. 

ఇంచుమించుగా అలాంటి కేటగిరీలోకే వస్తాడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు. తన భూమిని పట్టా భూమిగా మార్చాలని పలుమార్లు దరఖాస్తులు పెట్టుకున్నాడు. తోలుమందం అధికారులు పట్టించుకుంటేగా. ధరణి దారుణాలలో ఇలాంటివి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా.. ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా.. తన భూమిని పట్టా భూమిగా మార్చట్లేదని మండిపడ్డాడు. ఆఫీసు చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అతనిని విసుగొచ్చింది. అధికారులు స్పందించడం లేదని ఒళ్లు మండింది. అందుకే, కాస్త క్రియేటివ్‌గా ఆలోచించాడు. చెట్టుకు తలకిందులుగా వేలాడాడు.. అధికారులకు ఇవ్వాల్సిన దరఖాస్తులను ఆ చెట్టు కొమ్మకు వేలాడ దీశాడు. తనూ ఓ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ.. తన భూమిని పట్టా భూమిగా మార్చండి మహాప్రభో అంటూ వేడుకుంటా.. ఓ వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది స్థానికంగా చక్కర్లు కొడుతోంది. ఇలాగైనా మేటర్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకపోతుందా?.. తన పని చేసి పెట్టకపోతారా? అనేది ఆ యువకుడి ఆరాటం.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×