BigTV English

Retro Movie: ‘రెట్రో’ సినిమాలో ఆ సీనే హైలెట్.. స్పాయిలర్ ఇచ్చేసిన సూర్య

Retro Movie: ‘రెట్రో’ సినిమాలో ఆ సీనే హైలెట్.. స్పాయిలర్ ఇచ్చేసిన సూర్య

Retro Movie: ఈరోజుల్లో సినిమాను ప్రమోట్ చేయడం కోసం మేకర్స్ చాలానే కష్టపడుతున్నారు. ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడం కోసం సినిమాలోని కీలక అంశాలన్నీ ముందే చెప్పేస్తున్నారు. క్లైమాక్స్ బాగుంటుందని, ఎమోషన్స్ బాగుంటాయని చెప్తూనే ఇంకా మూవీలో ఏదో ఉంటుంది అనే ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా అదే పని చేస్తున్నాడు. సూర్యకు ఇప్పుడు ఒక కమ్ బ్యాక్ హిట్ చాలా అవసరం. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో సతమవుతున్న సూర్య.. ఇప్పుడు తన ఆశలన్నీ ‘రెట్రో’పైనే పెట్టుకున్నాడు. అందుకే ఈ మూవీపై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడం కోసం ఒక కీలక సన్నివేశం గురించి బయటపెట్టేశాడు సూర్య.


అదే సీన్

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమానే ‘రెట్రో’. మే 1న విడుదల కానున్న ఈ సినిమాకు చాలాకాలం క్రితమే ప్రమోషన్స్ మొదలుపెట్టాడు సూర్య. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాకు ప్రాణమయిన సీన్ గురించి స్పాయిలర్ ఇచ్చేశాడు. అంతే కాకుండా మూవీ మొత్తంలో తనకు ఆ సీన్ చాలా స్పెషల్ అంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఈరోజుల్లో సినిమాల్లో కీలకమైన సన్నివేశాలు ఉన్నాయని చెప్తూ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయడం కామన్ అయిపోయినా వెళ్లి చూస్తే అలాంటి సీన్స్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు చాలానే డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ సూర్య మాత్రం నమ్మకంగా ఒక 15 నిమిషాల సీన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.


కెమెరా ఆగదు

‘‘రెట్రోలో సింగిల్ షాట్ 15 నిమిషాలు ఉంటుంది. అందులో మేము డ్యాన్స్ చేస్తాం, ఫైట్ చేస్తాం, వాదించుకుంటాం. అలా చాలానే జరుగుతాయి. ఆ సీన్‌లో నటీనటులంతా ఒకే సింక్‌లో ఉండాలి. కెమెరా అసలు కట్ అవ్వదు. ముందుగా కెమెరా గ్రౌండ్ లెవెల్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్తుంది. ఆ తర్వాత బాల్కనీకి వెళ్తుంది. రైట్, లెఫ్ట్ అన్ని వైపులా తిరుగుతుంది. ఆ తర్వాత బెస్మెంట్‌లోకి వెళ్లిపోతుంది. అదేంటో మీకు చూస్తేనే అర్థమవుతంది. మ్యాడ్‌నెస్‌లాగా ఉంటుంది’’ అంటూ ఆ సీన్ గురించి గొప్పగా మాట్లాడాడు సూర్య (Suriya). టెక్నికల్‌గా మాత్రమే కాకుండా ఎమోషనల్‌గా కూడా సీన్ చాలా బాగుంటుందని ఫ్యాన్స్‌కు మాటిచ్చాడు.

Also Read: ఇన్నేళ్లకు బయటికొచ్చిన షాలిని.. ఆమెలో ఇది గమనించారా.?

గెస్ట్ రోల్

దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) కూడా ఒక పాటలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తాడని కూడా రివీల్ చేశాడు సూర్య. తను ఎంటర్ అవ్వడం వల్ల సీన్‌కు, సాంగ్‌కు కొత్త కళ వస్తుందని అన్నాడు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెట్రో’ను స్టోన్ బెంచ్ క్రియేషన్స్‌తో కలిసి 2డీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది. ఇందులో సూర్యకు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఇప్పటికే సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. మే 1న ఎన్నో సినిమాల మధ్య ‘రెట్రో’ (Retro) కూడా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ కూడా అదే రోజు విడుదల కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×