Snake Viral Video: ఓ భారీ నాగుపాము చేపల వలలో ఇరుక్కుపోయింది. దీంతో అక్కడున్న స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. దీంతో ఆయన పామును కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాడు. కానీ చివరకు ఏం జరిగిందో తెల్సా? మనకు మామూలుగా పాము కనబడితే.. భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తుతుంటాం. పాము ఎక్కడ హానీ చేస్తుందో అని దూరంగా వెళ్లిపోతాం. అయితే కొంత మంది మాత్రం పాములతో పిచ్చి ఆటలు ఆడుతూ ప్రాణాలనే కొనితెచ్చుకుంటున్నారు. మరి కొంత మంది పాముల దగ్గరకు వెళ్లి ఫోటోలకు పోజులిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇలాంటి సమయాల్లోని ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. స్నేక్ క్యాచర్ చేపల వలలో చిక్కుకుపోయిన నాగుపామును కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఊహించని షాక్ తగిలింది.
सांप पकड़ने के लिए मशहूर मुरलीवाले हौसला को आज कोबरा सांप ने डंस लिया। हालत बिगड़ने पर उन्हें अस्पताल में भर्ती करवाया है। मुरलीवाले फेमस यूट्यूबर हैं। उनके यूट्यूब पर 15.8M, FB पर 5.5M, इंस्टा पर 2.5M फॉलोवर्स हैं। वो अब तक करीब 8 हजार सांप पकड़ चुके हैं।
📍जौनपुर, UP pic.twitter.com/z31Mt17krS— Sachin Gupta (@SachinGuptaUP) June 3, 2025
వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని జౌన్‌పూర్‌లో ఓ పెద్ద నాగుపాము వలలో చిక్కుకుంది. బయటకు రావడానికి నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో అక్కడున్న స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న అతను పామును కాపాడడానికి తీవ్రంగా శ్రమించాడు. చాలా చాకచక్యంగా అక్కడున్న వలను కత్తిరించి పామును బయటకు తీసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అతడు పామును కాపాడే ప్రయత్నంలో.. అది ఒక్కసారిగా అటాక్ చేసింది. చేతిపై కాటేసింది. దీంతో అక్కడున్న స్థానికులు స్నేక్ క్యాచర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మురళి వాలే అనే ఈ స్నేక్ క్యాచర్.. ఫేమస్ యూట్యూబర్. పాములను చాకచక్యం పడుతుంటాడు. పాములను సులభంగా పట్టుకోవడంలో ఇతనికి అనుభవం ఉంది. ఇతను ఇప్పటివరకు వేల కొద్ది పాములను పట్టుకుని అడవిలో వదిలేశాడు. సంబంధించిన వీడియోలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. ఇతనికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. పాములు పట్టడంలో ఎక్స్‌పర్ట్ అయిన మురళీ గతంలో కూడా పాము కాటుకు గురయ్యాడు.
అయితే, తాజాగా ఆయనను నాగుపామును కాపాడుతుంటే.. కాటేసిన ఘటన అక్కడ అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో 15 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియోలు నెటిజన్లు పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు. పాములను పట్టడంతో ఎంత అనుభవం ఉన్నా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని.. మురళి వాలే త్వరగా కోలుకోవాలని.. మరోసారి ఇలాంటి మిస్టేక్ చేయొద్దని కామెంట్లు చేస్తున్నారు.